Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జన నాయకుడికే పట్టం

. ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే ప్రధాని అభ్యర్థిత్వం
. ఇండియా కూటమికి నిర్ణయాత్మక తీర్పు తథ్యం
. 262కుపైగా స్థానాల్లో గెలుపుపై విశ్వాసం
. పీటీఐ ఇంటర్వ్యూలో జైరాం రమేశ్‌

న్యూదిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి అనుకూలంగా ‘నిర్ణయాత్మక తీర్పు’ రాబోతోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే సహజంగా అదే పార్టీ ప్రతినిధి ప్రధాని అభ్యర్థి అవుతారని ఆయన తెలిపారు. ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసేందుకు 48 గంటలు కూడా పట్టవన్నారు. ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజైన గురువారం పీటీఐకి జైరాం రమేశ్‌ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియా కూటమి గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. దిగువ సభలో 272 మార్కును దాటుతామని చెప్పారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలకు అనుకూలంగా ప్రజల తీర్పు వస్తుందని నమ్మకంగా చెప్పారు. ఎన్డీయే మిత్రపక్షాల్లో కొన్ని ఇండియా కూటమి భాగస్వాములు అయ్యే అవకాశం లేకపోలేదన్నారు. ‘జనబంధన్‌’ (ఇండియా కూటమి భాగస్వాములు)లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే సహజంగా అదే పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి ఉంటాంని అన్నారు. ఇందుకు కాంగ్రెస్‌కు అవకాశం ఉందని చెప్పారు. తన వ్యాఖ్యలను ఏ విధంగానైనా అర్థం చేసుకోవచ్చని జైరాం రమేశ్‌ చమత్కరించారు. ప్రధాని అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదురుతుందా అన్న ప్రశ్నికు ‘కూటమి నినాదం నేను కాదు మేము… నాది కాదు మాది’ అని ఆయనన్నారు. వైవిధ్య సంకీర్ణం సుస్థిరంగా ఉండలేరన్న విమర్శలను జైరాం రమేశ్‌ కొట్టిపారేశారు. పదేళ్ల పాటు మన్మోహన్‌ సింగ్‌ అధ్వర్యంలో సాగిన యూపీఏ పాలన ఇందుకు నిదర్శనమని అన్నారు. సుస్థిర, పారదర్శకత, బాధ్యతగల, జవాబుదారీగల పరిపాలన అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ‘జనబంధన్‌’ ప్రధాని అధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థ సరైన దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. మోదానీ, మోదాంజలి కుంభకోణాలపై దర్యాప్తునకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇది కక్షసాధింపు కాదని, దీని కోసం ఏడాదిన్నరగా డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. అదానీ మాకు టెంపోల నిండా బస్తాల్లో డబ్బు పంపిస్తుంటే విచారణ జరిపించాలని కదా అని జైరాం రమేశ్‌ వ్యంగ్యంగా అన్నారు. ఫలితాలు వచ్చాక ఎన్డీయే మిత్రపక్షాలు కొన్ని ఇండియా కూటమిలోకి వస్తాయని చెప్పారు. ఎన్నికల తర్వాత ఇండియా కూటమి భాగస్వాములు అయ్యేందుకు జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్‌, టీడీపీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు వంటి వారికి అవకాశం ఇస్తారా అన్న ప్రశ్నకు పల్టీలు కొట్టడంలో నితీశ్‌ దిట్టని జైరాం రమేశ్‌ బదులిచ్చారు. 2019లో కాంగ్రెస్‌ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. ఇండియా, ఎన్డీయే మధ్య రెండు వ్యత్యాసాలు ఉన్నాయని, అవి మానవత్వం, నిజాయితీ అని అన్నారు. నిజాయితీ, మానవత్వంగల పార్టీలు ఎన్డీయేలో ఉంటేగనుక అవి ఇండియా కూటమిలోకి వచ్చేస్తాయని చెప్పారు. ప్రజా తీర్పుతోనే ఇండియా కూటమి ‘అధీకృత’ ప్రభుత్వం ఏర్పాటవుతుందని… నిరంకుశంగా కాదని తెలిపారు. భారీ విజయం వరించబోతోందని ఆకాంక్షించారు. భారత్‌ జోడో యాత్రను రాహుల్‌ గాంధీ ప్రారంభించిన వివేకానంద స్మారకం వద్ద ధ్యానం చేసేందుకు ప్రధాని మోదీ వెళ్లారన్నారు. తన శేష జీవితాన్ని ఎలా గడపాలని ఆయన ఆలోచిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆరు దశల ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు ‘సంఖ్యల జోలికి వెళ్లను కానీ ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాబోతోంది. నిర్ణయాత్మక తీర్పు వస్తుంది. 273 స్థానాలంటే స్పష్టమైన మెజారిటీ వచ్చినట్టే కానీ అని నిర్ణయాత్మకం కాదు. స్పష్టమైన, నిర్ణయాత్మక మెజారిటీ అంటే 272 కంటే ఎక్కువ స్థానాలు ఇండియా కూటమికి రావడం’ అని జైరాం రమేశ్‌ తెలిపారు. 2004 ఫలితాలు 2024లో పునరావృతం కాబోతున్నట్లుచెప్పారు. రాజస్థాన్‌, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయన్నారు. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, అసోంలోనూ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని, 20 ఏళ్ల తర్వాత విజయం సిద్ధించబోతోందని జైరాం రామేశ్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ రాణిస్తుందన్నారు. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో 39, 18 చొప్పున స్థానాలను బీజేపీ గెలవడం అసాధ్యమని చెప్పారు. జూన్‌ ఒకటో తేదీన ఇండియా కూటమి సమావేశం జరుగుతుందని పక్కా సమాచారం లేదు కానీ భాగస్వామ్య పార్టీలు తప్పకుండా భేటీ అవుతారని జైరాం రమేశ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img