అనుమానితులను ప్రశ్నించి రికార్డు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కార్డెన్ అండ్ సెర్చ్ లక్ష్యం.
ఎస్సై అరుణ్ కిరణ్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అనుమానితులను ప్రశ్నించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కార్డాన్ అండ్ సెర్చ్ ఉద్దేశమని ఎస్సై అరుణ్ కిరణ్ అన్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో ఎక్కడా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడడమే లక్ష్యంగా గ్రామంలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు సుమారు 100 మంది పోలీస్ బృందంతో శనివారం గ్రామంలోని శాడిపేట వీధిలో CASO ఆపరేషన్ నిర్వహించామన్నారు. అందులో భాగంగా ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ గృహంలో ఉన్న అందరి ఆధార్ కార్డులు పరిశీలించి, వారి యొక్క పూర్తి వివరాలును తెలుసు కోవడంతోపాటు, వాహనాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా రికార్డ్ లు సక్రమంగా లేని పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.