Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చేనేత పరిశ్రమను కాపాడండి

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం

విశాలాంధ్ర – ధర్మవరం:: చేనేత పరిశ్రమను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా చలపతి, శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముందుగా అసెంబ్లీ ఎలక్షన్లో ధర్మవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్య కుమార్ యాదవ్ కు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియచేసారు.
ధర్మవరం అంటే చేనేత పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది అని, కొన్ని సంవత్సరాల క్రితం ధర్మవరానికి ఇతర జిల్లాల నుండి మండలాల నుండి గ్రామాల నుండి ధర్మవరానికి వచ్చిన వారందరికీ ధర్మ వరం చేనేత పరిశ్రమ ఎంతోమందికి ఉపాధి కల్పించింది అని తెలిపారు.గతంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిలదొక్కుకొని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించింది కానీ గత ఐదు సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది అని, దీనికి కారణం కొంతమంది స్వార్థపరులు వారి ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుకోవడానికి పవర్ లూమ్స్ మగ్గాలను చట్ట వ్యతిరేకంగా ధర్మవరానికి తీసుకువచ్చి చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయడం దారుణమన్నారు. చేనేతకు కేటాయించిన 11 రకాలను పవర్లూమ్స్ మగ్గాలలో వేయకూడదు అన్న నిబంధన ఉన్న, వాటినన్నిటిని తుంగలో తొక్కి విచ్చలవిడిగా ధర్మవరంలో పవర్లూమ్స్ మగ్గాలను నడిపిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అండగా నిలబడి,ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలకు వచ్చిన, వారిని బెదిరించి, తనిఖీలు చేయకుండా బెదిరించడం జరిగిందన్నారు. 2023వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్మవరంలో పవర్లూమ్స్ మగ్గాలలో ఫీవర్ టు ఫీవర్ నేయకూడదని నిరాహార దీక్షలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. కానీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించకపోగా నన్ను తిట్టిన వారికి నోరు పడిపోయిందని, సిపిఐ కార్యదర్శి మధు పైన అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపించడం జరిగిందన్నారు. మేము అప్పుడే చెప్పాం… చేనేత కార్మికుల ఉపాధి పై కొడుతున్నారు, కానీ మా కార్మికుల దగ్గర ఓటు అనే ఒక ఆయుధం ఉన్నదని రాబోయే ఎలక్షన్లలో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించడం జరిగింద నీ తెలిపారు. పవర్లూమ్ మగ్గాలకు మేము వ్యతిరేకం కాదు కానీ ఫీవర్ టు ఫీవర్ నేయకుండ చూడాలని, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం,ప్రస్తుత ఎమ్మెల్యే సత్య కుమార్ చేనేత పరిశ్రమను చేనేత కార్మికులను కాపాడాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, గౌరవాధ్యక్షులు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు విజయభాస్కర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img