Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏక పార్టీ పాలనకు వ్యతిరేక తీర్పు – సీపీఐ

న్యూదిల్లీ : ‘ఇండియా’ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మెరుగ్గా జరిగి, ఐక్యంగా ప్రచారం చేసివుంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చివుండేవని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శివర్గం బుధవారం ఒక ప్రకటన చేసింది. అంతేకాకుండా బీజేపీ స్థానాలను మరింతగా కొల్లగొట్టివుండేవాళ్లమని పేర్కొంది. బీజేపీకి సవాల్‌ విసురుతూ ‘ఇండియా’ కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరిని అభినందించింది. అదే సమయంలో మెరుగైన ఫలితాలు సాధించిన ఇండియా ఐక్య సంఘటన పార్టీలకు శుభాకాంక్షలు తెలిపింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా ఏక పార్టీ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడిరదని సీపీఐ ప్రకటన పేర్కొంది. కార్పొరేట్‌ మద్దతుగల బీజేపీ ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడేలా ప్రజా తీర్పు వచ్చిందని తెలిపింది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకు…. విద్వేష రాజకీయాలు, వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని వెల్లడిరచింది. నిరుద్యోగం, మైనారిటీలపై మానవ హక్కులపై, ప్రజాస్వామ్యంపై దాడులను తిప్పికొట్టేలా ప్రజా తీర్పు ఉందని పేర్కొంది. ప్రజా సమస్యలను, కీలక అంశాలను పక్కకు పెట్టి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలను చేసిన నరేంద్ర మోదీపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం విమర్శించింది. ఇండియా ఐక్య సంఘటనలో సీపీఐ పాత్ర కీలకంగానే ఉంటుందని, ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రాథమిక హక్కుల పరిరక్షణకుగాను భారతీయులను మరింత చైతన్యపర్చేందుకు సీపీఐ క్రియాశీలంగా ఉంటుందని పేర్కొంది. తాజా ఫలితాలపై సీపీఐకు, లెఫ్ట్‌ పార్టీలకు ఆత్మవిమర్శ అవసరమని… పూర్తి నివేదికలు వచ్చాక ఫలితాలపై తమ పార్టీ నిశిత సమీక్ష నిర్వహిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img