Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పరాజితుల లోకం

ఓ ప్రహసనం ముగిసింది. గెలిచింది ఎవరో తేలింది. ఓడిన వారెవ్వరో తెలిసిపోయింది. పరాజితులు మాత్రం మిగిలిపోయారు. అవును, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పరాజితులెప్పుడూ ప్రజలే.
ఎన్నికల క్షేత్రంలో ఓడిన వారు ఉండరు. అన్ని రాజకీయ పార్టీలు ఎక్కడో ఒకచోట గెలుస్తూనే ఉంటాయి. కొన్ని పార్టీలు ఎక్కువ చోట్ల గెలిచి అధికార పీఠం ఎక్కుతాయి. మరికొన్ని పార్టీలు తక్కువ సీట్లతో ప్రతిపక్షంలో కూర్చుంటాయి. ఒక్కోసారి ఆ గౌరవం కూడా దక్కకపోవచ్చు. అయినా, ఆ పార్టీ నుంచి విజయం సాధించిన ప్రతినిధులు శాసనాలయాలలో కూర్చుంటారు. అలా ఏ అర్హత లేకుండా, కేవలం ఓటు మాత్రమేవేసి ఐదేళ్లవరకూ ఎదురుచూపులు చూసేది పరాజితులైన ప్రజలే. ఎన్నికలైపోయిన తర్వాత దేశం దిగులుగా ఎందుకుంటుందంటే ఎక్కడ చూసినా పరాజిత సమూహమే ఎదురుపడుతుంది.
ఓట్ల పండుగకు ముందు నీ బిడ్డ ముక్కు చీమిడి తీసిన చేతులు మళ్లీ ఐదేళ్ల వరకూ నీ కంట పడవు. నీ బిడ్డల అలనా, పాలనా చూసేది మేమే అన్న ప్రచారాలు నీ చెవుల్లో మారుమోగుతాయి తప్ప ఆలా మాట్లాడిన వారెవ్వరూ ఎక్కడా కానరారు. అధికారం చేజిక్కిన తర్వాత వారి ఎజెండాలే అమలవుతాయి తప్ప పరాజితుల బతుకులు సోదిలోకి కూడా రావు. ఒకప్పుడు అలా ఉండేది కాదని, ప్రజల కోసమే బతికిన వారిని మేము చూసామని కొందరు పెద్దలు చెబుతారు.
ఆ ఒకప్పుడు అనే పదం ఇప్పుడు ఏ నిఘంటువులోనూ కనపడదు. పరాజితుల గురించి దేశంలో ఎక్కడా ఏ చర్చా జరగదు. మీడియాలో కాని, పట్టణాల్లోకాని, పల్లెల్లో కానీ పరాజితుల ఊసే ఉండదు. ఎన్నికలు ఏదైనా రణక్షేత్రంలో గాయాలతో మిగిలేది పరాజితులైన ప్రజలే. ఓట్ల కోసం వచ్చిన అభ్యర్ధులు ఇడ్లీ బండి దగ్గర దోసెలు వేసిన దృశ్యం మాత్రమే నీకు గుర్తుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అంకెలే ప్రమాణికం కనుక పరాజితుల ప్రాణాలపై కాసింతైనా శ్రద్ధ కనపడదు. ఓటువేసే సమయంలో చూపుడు వేలుకు రాసిన సిరా చుక్క పరాజితుడికి పాములా భ్రాంతి గొలుపుతుంది.
ఆ పాము వొళ్లంతా తిరుగుతూ ఎక్కడ, ఎప్పుడు కాటేస్తుందోననే భయం వెంటాడుతుంది. ఓట్ల పండుగకు నువ్వు తిన్న బిర్యానీ పొట్లం, తాగి పడేసిన సీసా పరాజితుడి వెర్రిబాగులతనానికి ముసి ముసిగా నవ్వుకుంటాయి. నువ్వు ఎన్నుకున్న నాయకుడు నీకు కనిపించినా ఓ అపరిచితుడిలా నిన్ను దాటుకుంటూ వెళ్లిపోవడం బ్యాలెట్‌ బాక్సంత నిజం. ఎన్నికలైపోయాక బతుకు మీద భయం కలుగుతుంది. ఎన్నికలైపోయాక ప్రతి రోజూ ఆకలేస్తుందని గుర్తొస్తుంది. ఎన్నికలైపోయాక కలల గూడు మాయమైందని తెలుస్తుంది. ఎన్నికలైపోయాక ఎవరొచ్చినా జీవితాలు మారవని ఎరుక కలుగుతుంది. ప్రతీ ఐదేళ్లకు ఇది ఇలాగే జరుగుతుంది. ఇలాగే జరిగేలా ఏలిక జాగ్రత్తలు తీసుకుంటుంది. మళ్లీ ఐదేళ్లకు మరో ప్రహసనం ప్రారంభమవుతుంది. కాల చక్రం తప్ప బతుకు చక్రం ముందుకు పోదని అర్ధం అవుతుంది.

సీనియర్‌ జర్నలిస్టు,
సెల్‌: 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img