Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చదువు పేదరికానికి అడ్డం కాకూడదు

అకుంఠిత దీక్షతో చదువు కొనసాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.. శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం

విశాలాంధ్ర ధర్మవరం:: చదువు పేదరికానికి అడ్డం కాకూడదని, అకుంఠిత దీక్షతో చదువు కొనసాగిస్తే మంచి భవిష్యత్తు లభ్యమవుతుందని శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం అధ్యక్షులు జక్కా చిన్న సింగరయ్య, ఉపాధ్యక్షులు జింక రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి జింక చిన్నప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2023-24 వ విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ మంచి మార్కులు సాధించిన పద్మశాలీయ కుల బాంధవుల విద్యార్థులకు నగదు ప్రోత్సాహ, అభినందన సభను బ్రాహ్మణ వీధిలోని శ్రీ పద్మశాలీయ కళ్యాణ మండపంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము పద్మశాలీయ బహుత్తమ సంఘము ద్వారా పదవ ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ, సంఘం తరఫున నగదు బహుమతులను ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని, మరింత చదువును పెంపొందిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. పదవ ఇంటర్మీడియట్ పరీక్షల్లో బాలురు, బాలికలకు వేరువేరుగా నగదు బహుమతులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పదవ తరగతి ప్రధమ లో అనూష, ద్వితీయ లో పూజిత, తృతీయ లో తన్మయి, తదుపరి బాలురలలో ప్రధమ దుర్గా సాయి చరణ్, ద్వితీయ ధరనేశ్వర్, తృతీయ లో సాయి తేజ,అదేవిధంగా 90 శాతము మార్పులు తెచ్చిన త్రిష, శరణ్య, తేజస్విని, యశస్విని కార్తీక, బాలుర లలో జింక కార్తీక్ లకు ఒక్కొక్కరికి 2,116 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. బాలురు బాలికలలో ప్రధమ నగదు బహుమతి రూ.4,016, ద్వితీయ నగదు బహుమతి రూ.3,516, తృతీయ బహుమతి రూ.3,116 సంఘం ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగులైన మునీంద్రకు రూ.10,116 ఇవ్వగా, తదుపరి ఇంటర్మీడియట్ లో కూడా బాలురు, బాలికలకు వేరువేరుగా ఇవ్వడం జరిగిందని, ఇందులో ప్రధమ లో పూజిత, ద్వితీయ లో అర్చనా కేదారాశ్వరి, తృతీయ లో గిరిష్మా, తదుపరి బాలురలలో ప్రథమలో చైతన్య, ద్వితీయ లో చైతన్య కుమార్, తృతీయ లో హరీష్ లకు, 90 శాతం మార్కులలో బాలుర లలో హరీష్ కుమార్, బాలికలలో భవ్య, లావణ్య, లక్ష్మీ, భావన లకు ఒక్కొక్కరికి రూ.4,116 నగదు ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ లో ప్రథమ వచ్చిన వారికి రూ.5,116, ద్వితీయ లో రూ.4,516, తృతీయ లో రూ.4,116 ఇవ్వడం జరిగిందన్నారు. పద్మశాలి కుల బాంధవులందరూ కూడా చదువులో మరింతగా రాణించాలని, చదువుకు తగ్గ ఆర్థిక సహాయాన్ని సంఘం ద్వారా భవిష్యత్తులో కూడా తాము అందించేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి బుడగల శంకర్, కోశాధికారి పొలాల పుల్లయ్య, సంఘం సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. ఇటువంటి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సంఘముకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img