Monday, October 28, 2024
Monday, October 28, 2024

కేంద్రం, ఎన్‌టిఎపై మండిపడిన సుప్రీంకోర్టు

నీట్‌ స్కామ్‌పై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టిఎ), కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపడింది. నీట్‌ పరిక్ష నిర్వహణలో ఎవరిదైనా 0.01 శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని వెంటనే సరిచేయాలని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ ఎస్‌.వి. భట్టిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ కేంద్రం, ఎన్‌టిఎలను ఆదేశించింది.ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్‌ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది.

నీట్‌ యుజి -2024 పరీక్ష నిర్వహించేటప్పుడు ఏదైనా తప్పులు జరిగితే.. దృఢమైన వైఖరిని కలిగి ఉండాలని.. అవసరమైతే ఆ తప్పును అంగీకరించాలని పేర్కొంది. ు మీరు ధృడమైన వైఖరిని కలిగి ఉండాలి. తప్పు జరిగితే అవును తప్పు జరిగింది. తప్పును సవరించేందుకు ఈ చర్యలు తీసుకోబోతున్నాం. అని అంగీకరించగలగాలని ఎన్‌టిఎని ఆదేశించింది. ఆ తప్పుని అంగీకరిస్తే .. అది మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుందిు అని జస్టిస్‌ భట్టి పేర్కొన్నారు.నీట్‌పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి అని మౌఖికంగా వ్యాఖ్యానిస్తూ.. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ తన సహన్యాయమూర్తితో ఏకీభవించారు. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడు అయితే సమాజానికి హానికరంగా మారుతుందని జస్టిస్‌ భట్టి వ్యాఖ్యానించారు. నీట్‌కు సిద్ధమయ్యేందుకు లక్షలాది మంది చిన్నారులు నిజాయితీగా ప్రయత్నిస్తారని, వారి ప్రయత్నాన్ని, ఆశయాలను మోసం అడ్డుకుందని జస్టిస్‌ భట్టి మండిపడ్డారు. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img