Monday, October 28, 2024
Monday, October 28, 2024

ఈవీఎం వద్దు…బ్యాలెట్‌ ముద్దు

జగన్‌ సంచలన ట్వీట్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఈవీఎంలు వద్దు… బ్యాలెట్‌ పేపర్‌ ముద్దు… అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం సంచలన ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా పేపర్‌ బ్యాలెట్లు వాడాలన్నారు. అటు ఈవీఎంలను నిషేధించాలంటూ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ నుంచి జగన్‌ కూడా ఈవీఎంలను వాడొద్దంటూ ట్వీట్‌ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోను ఈవీఎంలు కాకుండా పేపర్‌ బ్యాలెట్లే వాడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్‌లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్‌ బ్యాలెట్లు వాడాలన్నారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లుగా కనిపించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు… మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో తీర్పు ఎలా ఇస్తారో… అలాగే ఉండాలని అన్నారు. ఇటీవల ఈవీఎంలను మేనేజ్‌ చేయొచ్చు అంటూ ఎలెన్‌ మస్క్‌ ట్వీట్‌ చేయగా… దానిపై ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేగింది. భారత్‌లోనే అనేక మంది రాజకీయ నేతలు ఒక్కొక్కరికీగా బయటకు వచ్చి ఈవీఎంతో ఎన్నికల నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.
వైసీపీ కార్యక్రమాల్లో మార్పులు
ఈనెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తన కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈనెల 22కు బదులుగా ఈనెల 20న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరవుతారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి వస్తారు. వారందరికీ పార్టీ అధ్యక్షులు జగన్‌ దిశానిర్దేశం చేస్తారు.
జగన్‌ను కలిసిన పార్టీ నేతలు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు కలిశారు. కోలగట్ల వీరభద్ర స్వామి, అదీప్‌రాజ్‌, పొన్నాడ సతీశ్‌, సింహాద్రి చంద్రశేఖర్‌ తదితరులు కలిశారు. వారితో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, పార్టీ ఓటమి తదితర అంశాలపై జగన్‌ చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img