ముంబయి: ఆల్-న్యూ బీఎండబ్ల్యు ఆర్ 1300 జీఎస్ భారతదేశంలో విడుదలైంది. బీఎండబ్ల్యు మోటర్రాడ్ ఇండియా ఆల్-న్యూ బీఎండబ్ల్యు ఆర్ 1300 జీఎస్ని విడుదల చేసింది. ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్ (సీబీయూ)గా అందుబాటులో ఉంటుంది. జూన్ 2024 చివరి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. బీఎండబ్ల్యు గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాప్ా మాట్లాడుతూ, బీఎండబ్ల్యు మోటోరాడ్ నాలుగు దశాబ్దాల క్రితం ఆర్ 80 జీఎస్‌తో టూరింగ్ ఎండ్యూరోల కొత్త విభాగాన్ని నెలకొల్పింది. బాక్సర్ ఇంజిన్ కలిగిన బీఎండబ్ల్యు జీఎస్ అప్పటి నుంచి పోటీ రంగంలో తిరుగులేని నాయకునిగా కొనసాగుతోంది. ఆల్-న్యూ బీఎండబ్ల్యు ఆర్ 1300 జీఎస్‌తో, బీఎండబ్ల్యు మోటార్రాడ్ జీఎస్ని మరింత పదును పెట్టడంపై దృష్టి సారించింది. ఇది శక్తి, సౌలభ్యం, చురుకుదనాల ఖచ్చితమైన కలయికగా, ఇది ఏ భూభాగానికి అయినా అనువైన మోటార్‌సైకిల్‌గా ఉంటుంది. దాని బహుముఖ ప్రజ్ఞ, ఆకర్షణతో, ఆల్-న్యూ బీఎండబ్ల్యు ఆర్ 1300 జీఎస్ అత్యధిక అంచనాలను కూడా అధిగమిస్తుంది. ఏదీ మిమ్మల్ని ఆపదు, ముఖ్యంగా ఆఫ్-రోడ్ అయినా’’ అని పేర్కొన్నారు.