Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అన్నదాతను మభ్యపెట్టే ప్రయత్నం

అభివృద్ధి తప్ప రాజకీయ ఎజెండా లేదని ప్రపంచ బ్యాంకు పైకి చెపుతున్నప్పటికీ అది వెల్లడిరచిన పత్రాలు, పరోక్షంగా చేసిన ప్రస్తావనలు మాత్రం కచ్చితంగా పాలకులకు రాజకీయంగా మద్దతు కల్పించే విధంగానే ఉంటాయి. తమ విధానాలు అమలు జరుపుతున్న పాలకులకు రాజకీయ మద్దతు ఉండాలన్నా, ఆయా దేశాలలో తలెత్తే సామాజిక అశాంతిని చల్లార్చేందుకు, పక్కదారి పట్టించేందుకు ఏమి చేయాలో ప్రపంచ బ్యాంకు నిపుణులు తాము వెల్లడిరచిన పత్రాలలో, పరోక్షంగా చేసిన ప్రస్తావనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వాటిలో భాగమే ప్రస్తుతం పాలకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన నరేంద్రమోదీ 2014లో గద్దెనెక్కిన తరువాత అనుసరించిన విధానాలు రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. తత్ఫలితంగా పదిహేనేళ్లుగా ఎదురులేని రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. దానితో రైతాంగాన్ని బుజ్జగించేందుకు, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునేందుకు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రూపొందించిందే రైతులకు పెట్టుబడి సాయం పథకం. సాగుచేసినా చేయకపోయినా భూ యజమానులకు వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందించేందుకు ఐదు సంవత్సరాల క్రితం మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పీఎం-కిసాన్‌. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం క్రింద ఇచ్చేది గోరంత…ప్రచారమేమో కొండంత. ఈ పథకం కింద రైతులకు ఏటా మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయలు సంబంధిత బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ అరకొర సాయానికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం చేస్తోంది. పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించినప్పుడు దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రయోజనమేమీ ఉండబోదని అనేక మంది నిపుణులు ఆనాడే ఖరాఖండిగా చెప్పారు. ఈ స్వల్ప మొత్తంతో రైతన్న ఆదాయంలో వచ్చే మార్పేమీ ఉండదు. రైతు రుణభారమూ తీరదు. పైగా ఆ అరకొర సాయం కూడా భూ యజమానులకే అందుతుంది తప్పించి కౌలు రైతులకు దక్కేదేమీ ఉండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పీఎం-కిసాన్‌ పథకం కింద రైతులకు అందజేస్తున్న సాయాన్ని పెంచుతారని అందరూ ఆశించారు. అయితే ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా గత ఐదు సంవత్సరాలుగా అందజేస్తున్న సాయాన్నే ఇప్పుడూ కొనసాగిస్తున్నది.
ఈ ఐదేళ్ల కాలంలో అలాంటి 16 వాయిదాలకు సంబంధించి చెల్లింపులు జరిగాయి. తాజాగా మంగళవారం 17వ వాయిదా సొమ్మును బదిలీ చేశారు. ఇది సాధారణంగా జరిగే కార్యక్రమమే. సాధారణంగా సంబంధిత మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ము నుంచి రైతుల ఖాతాకు నేరుగా నగదును బదిలీ చేస్తారు. మంత్రిత్వ శాఖకు చెందిన సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇదంతా యథావిధిగా జరిగే కార్యక్రమమే అయినప్పటికీ ఇదేదో కొత్త పథకమైనట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాతల ఖాతాలకు మంగళవారం నగదు బదిలీ చేశారు. దీనికి గోదీ మీడియా ఎనలేని ప్రధాన్యత ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఎం కిసాన్‌ 17వ వాయిదా చెల్లింపు ఫైల్‌పైనే మోదీ తొలి సంతకం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలో మంగళవారం తొలిసారి పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన దేశంలోని 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,000 వేల కోట్లు జమ చేస్తారని బీజేపీ అనుకూల ప్రసార మాధ్యమాలలో కొద్ది రోజుల ముందు నుంచి భారీగా ప్రచారం చేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది రైతన్నలు ఆన్‌లైన్‌ ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన అపూర్వ తీర్పు చరిత్ర సృష్టించిందనీ, ప్రజాస్వామ్య దేశాల్లో ఓ ప్రభుత్వాన్ని మూడో దఫా ఎన్నుకోవడం అత్యంత అరుదైన విషయమైనా దేశ ప్రజలు దాన్ని ఆవిష్కరించారన్నారు. తమ కొత్త ప్రభుత్వం రైతులు, పేదలకు ప్రయోజనం కలిగించే అంశంపైనే తొలి నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో మనదేశం మూడో ఆర్థికశక్తిగా ఎదిగేందుకు వ్యవసాయరంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే మోదీ పాలనలో వ్యవసాయం రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు నానాటికీ క్షీణించిపోతున్నాయి. దేశ జనాభాలో 45 శాతం మందికి పైగా ప్రజానీకం నేటికి జీవనోపాధి కోసం వ్యవసాయం పైనే ఆధారపడుతున్నారు. వ్యవసాయ రంగం సమస్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. చిన్న, సన్నకారు, కౌలు రైతుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రైతాంగానికి ఏమాత్రం గిట్టుబాటుగాలేని పాలకుల నయా విధానాల వల్లే వారు పదేపదే రుణగ్రస్తులవుతున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న రుణసాయం కూడా అత్యల్పమే. ప్రభుత్వ, వాణిజ్య, సహకార బ్యాంకులన్నీ కలుపుకున్నా కూడా రైతుకు కావాల్సిన పెట్టుబడుల్లో 50 శాతం కూడా వ్యవసాయ రుణాలుగా మంజూరు చేయడంలేదు. వ్యవసాయరంగానికి ప్రభుత్వం అంది స్తున్న రుణాలలో అత్యధిక భాగం ధనిక రైతులకే కేటాయిస్తున్నారు. చిన్న, సన్న కారు, కౌలు రైతులకు లభించే రుణం నామమాత్రమే. దానితో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్తుల విషకౌగిలిలో పేద రైతులు నలిగిపోతున్నారు. రుణాల వసూలులో వీరి నిర్బంధాలు, అవమానాలు ఇన్నీ అన్నీకావు. ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేయాల్సిందంతా చేస్తోంది. అరకొర సాయాన్ని అందిస్తూ దానినే ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. ఆందోళనలు, నిరసనల సందర్భంగా రైతులు లేవనెత్తిన అనేక సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. రైతుల సమస్యల పరిష్కారంలో ఉదాసీనత కనబర్చే మోదీ ప్రభుత్వం మంగళవారం వారణాసిలో అరకొర సాయంతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది తప్ప అన్నదాతకు చేసిన మేలు శూన్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img