Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : జగనన్న విదేశీ విద్యా నిధి పేరును మార్చి అంబేద్కర్ విదేశీ విద్యా నిధిగా పేరును కొనసాగిస్తున్నట్లు జీఓ విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ ఎస్సీ సెల్ మండల నాయకులు బొగ్గుల తిక్కన్న, నరసన్న, మీసేవ ఆంజనేయ, శ్రీనివాసులు, రామన్న కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డికి అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విదేశీ విద్యా నిధి విధానానికి అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యా నిధి పేరు మార్చారన్నారు. పేరు మార్చే సందర్భంలో చాలా సార్లు దళిత, ప్రజా సంఘాలన్నీ పేరు మార్చద్దు అంటూ మొరపెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ పేరును కొనసిగించాలని జీఓ విడుదల చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల సంక్షేమం మరియు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం దళితులకు చెందిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిందని, ఈ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించాలని, అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ ల అభ్యున్నతి కోసం ఎన్ ఎస్ ఎఫ్ డి సీ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ఆర్థిక పరిపుష్టి పెంపొందించేలా చంద్రబాబు ప్రభుత్వం మరింత కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొగ్గుల హనుమంతు, జ్వానేష్, జంబన్న, సుధాకర్, సందీప్, నరసన్న, రాజు, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img