Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జబ్బొకరికి మందు మరొకరికి

సావిత్రీ ఠాకూర్‌ కేంద్రంలో బాలల, మహిళా సంక్షేమ శాఖ మంత్రి. ఆమెకు బోర్డు మీద బేటీ బచావో ఔర్‌ బేటీ పఢావో అని రాయడమే రాలేదు. అలాంటి వారు మంత్రులుగా ఉన్నచోట విద్య సవ్యంగా ఉంటుందని, పరీక్షల నిర్వహణ, వాటి ఫలితాల ప్రకటన సక్రమంగా ఉంటుందని ఆశించలేం. వైద్య విద్యలో చేరాలనుకునే వారికి జాతీయస్థాయిలో నిర్వహించిన ‘‘నీట్‌’’ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌) పరీక్షలో గందరగోళం జరిగిందని ఆందోళనలు జరుగుతున్న సమయంలో కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా చేరగోరే వారికి నిర్వహించిన ‘‘నెట్‌’’ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షకు పదకొండు లక్షల మంది హాజరయ్యారు. పరీక్ష మంగళవారం జరిగితే గురువారం ఈ పరీక్షను రద్దు చేశారు. అదేమంటే ఈ పరీక్షలో గందరగోళం జరిగిందని అందువల్ల ఆ పరీక్షలకు విశ్వసనీయత ఉండదని ఆ పరీక్షను రద్దుచేశామని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ రెండు పరీక్షలు జాతీయ స్థాయిలోనే జరుగుతాయి. నెట్‌ పరీక్షను విశ్వవిద్యాలయ నిధుల సంఘం నిర్వహిస్తుంది. నెట్‌ పరీక్ష గత 18వ తేదీన 317 నగరాల్లో 1205 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. నెట్‌ పరీక్షలో విశ్వసనీయత లేదని సమాచారం అందినందువల్లే పరీక్ష రద్దు చేశారట. పరీక్ష జరిగిన మర్నాడే జాతీయ సైబర్‌ నేరాల విశ్లేషణా విభాగం నుంచి పరీక్షలో అక్రమాలు జరిగాయన్న సమాచారం అందిందట. ఈ విభాగం అమిత్‌ షా హోం మంత్రిత్వశాఖ అధీనంలో పనిచేస్తుంది. దేశంలోకెల్లా అత్యంత శక్తిమంతుడని చెప్పుకునే అమిత్‌ షా కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. నెట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఉప్పందిన వెంటనే విద్యాశాఖ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. మళ్లీ ఈ పరీక్ష ఎప్పుడు జరిగేది పరీక్ష రాసే వారికి తెలియజేస్తారట. ఈ పరీక్షలో అవకతవకలను విచారించే బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంఘం (సీబీఐ)కు అప్పగించారు. సీబీఐ కూడా అమిత్‌ షా నేతృత్వంలోనే పనిచేస్తుంది. నెట్‌, నీట్‌ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అనే వ్యవస్థ నిర్వహిస్తుంది. నీట్‌ పరీక్షా ఫలితాలు గత నాలుగో తేదీన వెల్లడైనాయి. ఇందులో 67 మంది విద్యార్థులకు నూటికి నూరుశాతం మార్కులు వచ్చాయి. ఈ పరీక్షలో మొత్తం 720 మార్కులు ఉంటే 67 మందికి 720 మార్కులు వచ్చాయి. ఇది అనూహ్యం. మరి కొందరికి 719, 718 మార్కులు వచ్చాయట. ప్రస్తుత పరిస్థితిలో ఇన్ని మార్కులు రావడం అసాధ్యమట. ఇంకా వైపరీత్యం ఏమిటంటే హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి నూటికి నూరుశాతం మార్కులు రావడం. ఈ కారణంగానే పరీక్షా పత్రాలు పరీక్షకు ముందే బయటకు వచ్చాయన్న వార్త వచ్చింది. పరీక్ష రాసిన విద్యార్థులు వీధులకెక్కారు. ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు ఈ ఫలితాలను నిలిపివేయడమో లేదా మొత్తం పరీక్షనే రద్దు చేయడమో చేయకుండా కౌన్సిలింగ్‌ కొనసాగడానికి అనుమతించింది. అనేక సందర్భాలలో అత్యున్నత న్యాయస్థానం తీర్పులు వరదెత్తిపోయిన తరవాత అడ్డుకట్ట నిర్మించినట్టు ఉండడం అనుభవంలో ఉన్నదే. నీట్‌ పరీక్షలో అనూహ్యంగా కొందరికి నూటికి నూరు శాతం మార్కులు రావడానికి పరీక్షా పత్రం సులభంగా ఉండడమే కారణమని ఎన్‌.టి.ఎ. అంటోంది. ఒక ప్రశ్నే తప్పుగా ఉండడం, కొంతమందికి సరైన సమయం చిక్కకపోవడం, సిబ్బంది చేసిన పొరపాట్లవల్ల అయిదేసి గ్రేస్‌ మార్కులు ఇచ్చారట. 720 మార్కులకు 720 మార్కులు రావడానికి గ్రేస్‌ మార్కులు కూడా కారణం అయి ఉండవచ్చునంటున్నారు. మరీ విచిత్రం ఏమిటంటే 1563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను తరవాత ఉపసంహరించారట. ఇది మరీ విచిత్రం. గ్రేస్‌ మార్కులు ఇచ్చినప్పుడు పనిచేసిన విచక్షణకు కారణం ఏమిటో అంతుపట్టదు. నీట్‌ పరీక్షకు సంబంధించి బీహార్‌, గోద్రాలో పరీక్షాపత్రాలు పరీక్షకు ముందే వెల్లడైనాయన్న ఆరోపణలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. ఈ ఆరోపణలు రుజువు అయితే అందుకు బాధ్యులైన వారిమీద చర్య తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉదారంగా ఓ హామీ పడేశారు.
ఈ ప్రభుత్వం పేపర్‌ లీకుల ప్రభుత్వంగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో అయితే పరీక్షకు ముందే ప్రశ్న పత్రం బయటకు వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నపత్రం లీక్‌ అయిందన్న ఆరోపణలు వచ్చిన అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీనే అధికారంలో ఉండడం విశేషం. కోటాలో నీట్‌ పరీక్షకు సిద్ధం అవుతున్న ఓ విద్యార్థి చెప్పిన వివరాలు పరీక్షలో ఎన్ని లొసుగులు ఉన్నాయో వివరాణా త్మకంగా తెలియజేస్తోంది. ఆ విద్యార్థి కథనం హృద్యంగా కూడా ఉంది. తాను కోటాలో శిక్షణ పొందుతుండగా తన దగ్గరి బంధువు ఫోన్‌చేసి పరీక్ష మన జేబులో ఉన్నట్టే ఇక నువ్వు తిరిగి వచ్చేయి అన్నాడట. ఆయన ఆ విద్యార్థిని మరో ఇద్దరు విద్యార్థుల దగ్గరకు తీసుకెళ్లారట. వారు ఈ విద్యార్థికి పరీక్షా పత్రంతో పాటు వాటికి సమాధానాలు కూడా అందజేసి బట్టీ పట్టమన్నారట. తెల్లవార్లు బట్టీ పట్టిన ఆ విద్యార్థి పరీక్షకు వెళ్తే అచ్చు గుద్దినట్టు అవే ప్రశ్నలు వచ్చాయట. పరీక్షా పత్రాలు ముందే బయటకు వచ్చాయనడానికి ఇంతకన్నా పెద్ద రుజువులు అక్కర్లేదుగా! అయితే పరీక్షరాసి బయటకు రాగానే ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. పరీక్షా పత్రాలు ముందే బయట పడ్డందువల్ల వివిధ రాజకీయ పక్షాలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్‌ శుక్రవారం దేశవ్యాప్త నిరసనకు పిలుపు ఇచ్చింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కితే పరీక్ష రాయడానికి తగినంత సమయం దక్కని 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్‌.టి.ఎ.ను ఆదేశించింది. మిగతా ఆరోపణల విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఎన్‌.టి.ఎ.కు నోటీసు జారీచేసి ఊరుకుంది. ఒక్కొక్క నీట్‌ ప్రశ్నాపత్రం 30 నుంచి 32 లక్షలు పలికిందట. అవినీతి, అక్రమాలు రాజకీయాలకు లేదా కొన్ని విభాగాలకు పరిమితమైన వ్యవహారంకాదు. అది సర్వాంతర్యామి. పరీక్షల నిర్వహణలో ఇంతలేసి అక్రమాలు జరగడం అంటే భావితరాల భవిష్యత్తుతో ఆటలాడుకోవడమే. ఈ వ్యవహారం బయటికి రాకుండా ఉంటే వారు వైద్య విద్య అభ్యసించడమే కాక వైద్యుల అవతారమెత్తి కత్తులు, కటార్లు పట్టుకుని రోగుల ప్రాణాలతో చెలగాటమాడు కోవడానికి అవకాశం ఇచ్చినట్టేగా! పాఠ్య గ్రంథాలను తమకు అనువుగా మార్చడం మీద బీజేపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ మెరుగైన విద్య అందించడం మీద, సక్రమంగా పరీక్షలు నిర్వహించడంమీద లేదు. అడ్డగోలుదారుల్లో అధికారం సంపాదించే వారి నుంచి మంచి నడవడిక ఆశించడం పేరాశే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img