London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

నష్టాల ఊబిలో బొప్పాయి రైతులు

పి.జమలయ్య

నర్సరీ యాజమాన్యాలు, విత్తన కంపెనీలు నాణ్యతలేని విత్తనాలు, నాసిరకం బొప్పాయి నారును విచ్చలవిడిగా విక్రయిస్తూ రైతాంగాన్ని మోసగిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వే కోడూరు, రాజంపేట, పీలేరు తదితర ప్రాంతంలో ఎప్పటి నుండో తైవాన్‌ రెడ్‌ లేడి 786 వెరైటీ రకం వంగడం నుంచి పెంచిన నారు వాడుతుంటారు. తైవాన్‌ రెడ్‌ లేడి 786 చీడపీడలు ఎక్కువ కావడంతో ప్రత్యామ్నాయంకోసం ఎదురుచూస్తున్న తరుణంలో జి.15, ఎక్స్‌ఎఫ్‌ 15 వెరైటీ రకం మార్కెట్‌లోకి వచ్చింది. ఈ రకం నారు అన్నిరకాల తెగుళ్లును, చీడపీడలను తట్టుకోగలదని నర్సరీ యాజ మాన్యాలు బొప్పాయి రైతులను నమ్మించి నిట్టనిలువునా మోసగిస్తున్నారు. పెట్టుబడులు పెట్టలేని చిన్న, సన్నకారు కౌలురైతులు దిగుబడి బాగా వస్తుందనే ఆశతో నర్సరీ యాజమాన్యాలు విషవలయంలో చిక్కుకుంటున్నారు. చదువులేని కౌలురైతుల అమాయకత్వాన్ని అసరా చేసుకుని ఒక్కో మొక్క నారును 11 నుంచి 15రూపాయలకు విక్రయించి అందిన మేరకు దోచుకుంటున్నారు. నారు తీసుకు వెళ్ళిన రైతులు దిగుబడి రాక నిట్టనిలువునా మోసపోతున్నారు. కనీసం ఖర్చులురాని పరిస్థితి ఏర్పడుతుంది. రాయలసీమలోని అన్నమయ్య జిల్లా కలికిరి, వాయల్పాడు, గుర్రంకొండ, కలకడ తదితర మండలాల్లో పలు గ్రామాల్లో బొప్పాయి సాగుకు వేలకువేలు కౌలు(లీజు) చెల్లించి, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా పంట రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బొప్పాయి రైతులు విలవిలాడుతున్నారు. నాణ్యత కల్గిన ప్రతి బొప్పాయి చెట్టుకు ఎంతలేదన్నా 100 కాయలు రావాలి. ప్రతికాయ రెండున్నర కేజీల బరువు ఉండాలి. మంచి రంగు, నాణ్యతతో దిగుబడి రావాలి. నాసిరకం నారు కావడంతో కాయ సైజు పెరగడంలేదు. దిగుబడి లేదు. కాచిన కాయలు పరిపక్వానికి రాక ముందే రాలిపోతున్నాయి. రంగులేదు రుచి లేదు. మార్కెట్‌కు తీసుకు వెళ్ళితే కాయల ముఖం చూసే పరిస్థితిలేదు. దీనికి కారణం నాసిరకం నారేనని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం
ఉలుకూపలుకు లేకుండా ఉంది. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న నర్సరీలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు లేవు. నాణ్యతలేని విత్తనాలు తీసుకొచ్చి నారుపెంచి అమ్ముతుంటే తనిఖీచేసే దిక్కులేదు. లైసెన్స్‌ లేని నర్సరీలే మార్కెట్‌లో కల్తీ నారు విక్రయాలల్లో స్వైరవిహరం చేస్తున్నాయి. స్టాక్‌ రిజిస్టర్‌ ఉండటం లేదు. నారు కోనుగోలు చేస్తే బిల్లులు ఇవ్వటం లేదు. అంతా అన్‌లైన్‌ పేమెంటులు. నర్సరీ యాజమాన్యాలు జీరో వ్యాపారంచేస్తూ ఒకవైపు ప్రభుత్వాన్ని, మరొకవైపు రైతాంగాన్ని మోసగిస్తున్నా నర్సరీ యజమానులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉద్యానవన శాఖ మొద్దు నిదుర పోతున్నది.
అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలోగల శేఖర్‌ రెడ్డి నర్సరీ, కలికిరి యల్లారెడ్డి, రాజన్న నర్సరీల నుంచి కలికిరి, గుర్రంకొండ, వాయల్పాడు కలకడ తదితర మండలాల్లో అనేక గ్రామాల రైతులు బొప్పాయి నారు కోనుగోలు చేస్తే బిల్లులు ఇవ్వని పరిస్థితి. అంతా ఫోన్‌ పే చెయించుకున్నారు. పంట రాలేదు అని అడిగితే మాకు సంబంధం లేదని తెగేసి చెబుతున్నారు. ఉద్యాన శాఖ దృష్టికి తీసుకు వెళ్ళితే నాసిరకం నారు ఎందుకు వేశారని రైతులను బుకాయిస్తున్నారు తప్ప నర్సరీయాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని చెప్పడం లేదు. దీంతో ఎమీ చేయలేని పరిస్థితి రైతాంగంలో ఉంది.
రాష్ట్రంలో బొప్పాయి 15 నుంచి 20 వేల ఎకరాలకుపైగా సాగువుతున్నది. అన్నమయ్య జిల్లాలో 5000, అనంతపురంలో 2200, ప్రకాశంలో 2000, సత్యసాయిలో 900, వైఎస్‌ఆర్‌ కడప 900 నంద్యాలలో 700, కర్నూలులో 600 ఎకరాల చొప్పున బొప్పాయి పండిస్తున్నారు. బొప్పాయిసాగు రాష్ట్రం మొత్తంగా పరిశీలిస్తే 75శాతం పంట రాయలసీమ జిల్లాలోనే ఉంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా ఉంది. జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, పీలేరు తదితర ప్రాంతంలో బొప్పాయి పంట చిన్న, సన్నకారు, కౌలు రైతులకు జీవనాధారంగా ఉంది.
బొప్పాయిసాగులో 90శాతం కౌలురైతులే. రెండు ఎకరాల నుంచి 5 ఎకరాల వరకూ లీజుకు తీసుకుంటున్నారు. బొప్పాయి పంట సంవత్సరన్నర కావడంతో ఎకరానికి రూ. 35వేలు నుంచి 40వేల వరకు కౌలు రేట్లు ఉన్నాయి. నారు నాటేముందు కౌలు మొత్తంలో సగం ముందే చెల్లించాలి. ఆ తరువాత పంట మధ్యలో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. పంట పండినా పండక పోయినా కౌలుమాత్రం గ్యారెంటీగా చెల్లించాల్సి ఉంది. కౌలు చెల్లించడానికి డబ్బులు వడ్డీకి తీసుకు రావాల్సిందే. ఇంతకు ముందు పేర్కొనట్లు వీరంతా చిన్న, సన్న కారు కౌలురైతులు. ముఖ్యంగా సెంటు భూమిలేని వారే. పెట్టుబడిని పరిశీలిస్తే ఏ పంటకు లేనంతగా బొప్పాయి సాగుకు ఖర్చు అవుతుంది.
కౌలుకు, సేద్యానికి పెట్టుబడి నూటికి రెండు రూపాయల వడ్డికి తెచ్చి బొప్పాయి పంటలు పండిస్తున్నారు. ఒక ఎకరంలో బొప్పాయి సాగుకు సుమారు రెండు లక్షల పైనే అవుతుంది. స్థూలంగా అధ్యయనంచేస్తే నారు కొనుగోలు రూ.12వేలు, పశువుల ఎరువులు రూ. 35వేలు, రసాయన ఎరువులు రూ.30వేలు, డ్రిప్‌ పరికరాలకు రూ.6వేలు, డ్రిప్‌ ఎరువులకు రూ.15వేలు దుక్కి రూ.15వేలు, పురుగు మందులు రూ.15వేలు, వివిధ కూలీల ఖర్చులు రూ.20వేలు, కౌలు రూ.40వేలు, మొత్తం పెట్టుబడికి వడ్డి కలుపు కుంటే నూటికి రూ.2చొప్పున 2 లక్షలు అప్పు చేయాలి.
బొప్పాయి పంటకు మార్కెట్‌లో ఎప్పుడూ ఒడిదుడుకులే ఉంటాయి. కష్టపడి పంట పండిస్తే తీరా మార్కెట్‌ మాయాజాలంలో రైతులు బలి కావాల్సిందే. కనీసం పెట్టుబడైనా వస్తుందా అంటే అది కూడా కనాకష్టమే అవుతుంది. వాతావరణం బాగుండి, ఎటువంటి చీడపీడలు రాకుండా, ప్రకృతి విపత్తులు లేకుండా పరిస్థితులు సానుకూలంగా ఉంటే సరాసరి దిగుబడి 25టన్నులు వస్తుందని అంచనా. కనీసం టన్ను రూ.20వేలకు అమ్మితే పెట్టుబడి వస్తుందని గుర్రంకొండ కొండ, కలికిరి, వాయల్పాడు మండలాలకు చెందిన కౌలురైతులు చెబుతున్నారు. లేకపోతే అప్పులు పాలే అంటున్నారు. నాసిరకం నారువలన జరిగిన నష్టానికి ఎకరానికి రెండు లక్షల రూపాయలు నర్సరీ యాజమాన్యాలనుంచి ఇప్పించాలని, రైతులను నమ్మించి మోసగించిన నర్సరీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నాసిరకం విత్తనాలు అమ్ముతున్న కంపెనీలపై కఠినమైన చర్యలు చేపట్టాలని రాయచోటి కలెక్టర్‌ ఆఫీసువద్ద ఇటీవల కాలంలో ఈ మూడు మండలాల రైతాంగం రైతు, కౌలురైతుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కూడా నిర్వహించింది. పుట్టుకొస్తున్న నర్సరీలను నియంత్రించడానికి చట్టం ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ు చీడపీడలు సమస్యలు కూడా ఎక్కవే.వీటి వల్ల జరిగిన పంట నష్టానికి ఎటువంటి పరిహారం అందటలేదు. ఉచిత పంటల భీమా పధకాన్ని అమలు చేయవలసిన ప్రాధాన్యత ఉంది. మార్కెటింగ్‌శాఖ బొప్పాయిపంటకు మంచిధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బొప్పాయి సాగులోఉన్న కౌలురైతులకు కౌలుగుర్తింపు కార్డులు జారీ చేయాలి. పంటరుణాలు, పెట్టుబడి సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, బీమా పరిహరం తదితర సౌకర్యాలు అందించాలి. ఉద్యాన, వ్యవసాయ శాఖ, మార్కెట్‌, బ్యాంకు, రెవెన్యూ తదితర శాఖలతో కమిటీవేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పరివేక్షణ చర్యలు తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img