Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పట్టణ వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించే విధంగా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తాను..

ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించే విధంగా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సీఎన్బి ఫంక్షన్ హాల్ లో పట్టణ ప్రముఖుల ఆత్మీయక కలయిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పట్టణ వ్యాపారస్తులు తమ సమస్యలను వారు విన్నవించుకున్నారు. తదుపరి వ్యాపారస్తుల ఇబ్బందులు, కష్టనష్టాలను కూడా మాట్లాడుతూ వ్యాపార పరిస్థితిని కూడా వారు వివరించారు. అనంతరం గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన మా వ్యాపారస్తుల యొక్క సమస్యలను ఏమాత్రం పరిష్కరించకపోవడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కోవడం జరిగిందని మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు తగిన న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వారి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను ధర్మవరం ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, అన్ని కులాల సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందని, అందరికీ పేరుపేరునా తాను కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో నన్ను ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంపిక చేసి, రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే దిశలో తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. పట్టణ వ్యాపారస్తుల సమస్యలు, చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ, నిరుద్యోగం, తదితర సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు, ఆక్రమణులు, దాడులు, బెదిరింపులు అధికమయ్యాయని, వాటన్నింటినీ ఎదుర్కొనే మార్గంలో తాను ఎల్లప్పుడూ ఉంటానని ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అంబటి సతీష్, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, జింక రామాంజనేయులు, జాతీయ చేనేత సభ్యురాలు జయశ్రీ, సాకే ఓబులేష్, పళ్లెం వేణుగోపాల్, గడ్డం పార్థసారధి, హేమంత్ కుమార్, మెడికల్ కుల్లాయప్పతో పాటు వందలాదిమంది చేనేత కార్మికుల నాయకులు, చేనేత వ్యాపారస్తులు పాల్గొని ఈ ఆత్మీయ కలయిక సభను విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img