Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

భక్తిఆశ భయం

అంత వేలంవెర్రి ఎందుకు పుణ్యదినాల్లోనె భగవంతుడు కనబడి మిగతా రోజుల్లో దర్శనం ఇవ్వడం. ఒకర్ని మించి ఒకరు వేలంవెర్రిగా తిరుపతి వెళ్లడం యాక్సిడెంటులో ప్రాణాలు పోగొట్టుకోవడం. అసలు ప్రభుత్వం యిలా ప్రోత్సహించడం తప్పుకాదా. ఏంటి భావ ఈరోజు పెద్ద ఉపన్యాసం ఇస్తున్నావు. ఉపన్యాసం కాదయ్యా నా మిత్రుడు తిరుపతి వెళ్లి వస్తుండగ కారు యాక్సిడెంటు అయి మరణించాడు. బాధ కొద్ది మాట్లాడుతున్నాను. ఇందు కలడందులేడని సందేహం వలదంటారు. సర్వాంతర్యామి, అణువణువున ఉంటాడంటారు. అలా చెబుతూనె యాత్రలు ప్రోత్సహిస్తారు. చూడయ్యా హద్దుమీరిన భక్తి మార్గం ద్వారా హద్దు తప్పిన జీవన విధానాన్ని ఆస్థికత్వం నేర్పింది దారి తెలియని సామాన్యులకు ఆశ, భయం అనే రెండు అంశాలను ప్రవేశపెట్టి మానసికంగా బలహీనులను చేసింది. ఆ బలహీనతను ఆసరా చేసుకుని ఆస్థికత్వం మానవుని వ్యక్తిత్వం దెబ్బతీసింది. కార్యకారణాలపై విచారణ జరిపి మనో నిబ్బరంతో జీవిస్తున్న వారి నుదుటిపై నాస్తిక ముద్ర వేసింది. అలాంటి వారిని సమాజంలో దూరంచేసే ప్రయత్నం చేసింది. మనో నిబ్బరాన్ని కోల్పోయి ఈతిబాధలతో సతమతమయ్యే దశలో అస్తిత్వం లేని దేవుణ్ణి సృష్టించింది. బలహీనులకు కష్టకాలంలోనే సహజంగా దేవుడు అవసరం అవుతాడు. ఆ దశలో మనిషిని ఆలోచించనివ్వకుండా భక్తి, మూఢనమ్మకాలలో ముంచి దేవాలయాల చుట్టూ తిప్పుతుంది. ఒక దేవుడు వల్ల కోరిక తీరకపోతె సామాన్యుని మనసు మారకుండ మరొక దేవుణ్ణి సృష్టించి దేవాలయం కట్టి వాటి చుట్టూ తిప్పుతుంది ఆస్థికత్వం. నిజమే అసలు భక్తి అంటె కైవల్య పధంబు చేరుటకై చింతించదని అన్నారు భక్త పోతనామాత్యుడు. భక్తి ద్వారా కైవల్యానికి చేరవచ్చునని నమ్మిన భక్తులు అలా ఆచరిస్తారు. అసలు భక్తితో పూజ ఎవరు ఎవరికి చేయాలి అనేది తత్వ సంబంధమైన ప్రశ్న. అయితే కైవల్యం ఎక్కడుంది, ఎలా చేరాలి అనే ప్రశ్నకు భక్తి ద్వారానే అని ఆస్తికులు చెబుతారు. సర్వ వ్యాపకుడై పిపీలాది బ్రహ్మ పర్యంతం నిండి నిభిడీకృతమైన విష్ణుతత్వాన్ని వైకుంఠంలో కూర్చోపెట్టి, కైవల్యం అక్కడే ఉందని, చేరడానికి దైవభక్తి ఒకటే మార్గమని ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతులు ప్రజలకు ముఖ్యంగా భక్తులకు బోధించారు. వైరుద్యాలతో కూడిన అనేక కథలు ప్రజల్లో వ్యాపింప చేసి ఆశ, భ్రమ కల్పించారు. అసలు ముఖ్యంగా భక్తి అంటే ఏమిటి? ఎలా ఉండాలి అనే విషయం ఆలోచించాలి. మనసులో భక్తి కలిగి ఉండి, దానికి ఒక కార్యరూపం యిచ్చి ఆచరించడం భక్తిగా పేర్కొనవచ్చు. దైవాన్ని నమ్మినవారు మనసులో భక్తి కలిగి ఉండవచ్చు. కాని భక్తి పేరుతో బాహ్య కార్యక్రమాలు నిర్వహించడం ఆడంబరంగా ఉంటుంది. అయితె ఆ కార్యక్రమాల వల్ల అమాయక ప్రజల్ని ఆకర్షించవచ్చు. అయితే ప్రస్తుత రాజకీయనాయకులు ఆ దారిన పయనిస్తున్న సంగతి మనకు తెలుసు. గుడిలోని విగ్రహానికి నమస్కరించి, కొబ్బరికాయ కొట్టి, అగరొత్తులు వెలిగించి, గంట మోగించి విగ్రహం పాదాల వద్ద పూలు ఉంచి, పూజారి ఆశీర్వాదం తీసుకోవడమె ప్రస్తుతం భక్తి కలిగి ఉండటంగా భావిస్తున్నాం. అంతేకాక కాశి, రామేశ్వరం, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కూడ భక్తిలో భాగంగానె పరిగణిస్తున్నారు. నిజమే తిరుముడి నెత్తిన పెట్టుకుని శబరిమలై వెళ్లిరావడం, జపమాల చేతబట్టి జపం చేయడం రామకోటి రాయడం కూడ భక్తిలోని భాగమే. కాని ఆ భక్తి వలన ఎవరికైనా ముక్తి లభించి కైవల్యానికి చేరారా అంటె చెప్పలేము. ఆశ్రమాల పేరిట జరిగె నేరాలు, ఘోరాలు నేడు అనేకం చూస్తున్నాం. భక్తి పూర్ణ స్థాయికి చేరినపుడు జ్ఞానేంద్రియాలు పనిచేయక మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. చేతన స్థాయి నుంచి అచేతన స్థాయికి చేరుకుని పరలోకంలో ఉన్న దేవుళ్లను, దేవతలను చూసిన అనుభూతి పొందుతాడు. నిజమె నిర్వికల్ప స్థితిలో సమాధి స్థితికి చేరి పొందిన అనుభవం తిరిగి జాగ్రదావస్థలో ఏమీ గుర్తుండవని ఎవరికి ఏమి చెప్పలేమని రామకృష్ణ పరమహంస అన్నారు. అందుకె అటువంటి నిరర్దక ఏకాగ్రత వల్ల ఉపయోగం లేదని వాస్తవ జగత్తులోని అన్నార్తులను ఆదుకోవడం ముఖ్యమని భావించి వివేకానందుడు ప్రపంచమంతా పర్యటించాడు. అంతేగాక సర్వ శక్తులు మనలోనె ఉన్నాయని తెలుసుకోలేక పరాధీనుడై యితరులపై ఆధారపడతాడు. పనికిరాని భక్తి కోసం, పూజల కోసం అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్నట్లు వివేకానందుడు భావించాడు. మనిషికి యితరంగా ఏ శక్తులు లేవని గ్రహించి మనిషి ధీరోదాత్తుడు కావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగె కోట్లు గడిరచి నడిపె ఆశ్రమాలు సామాన్యులకు ఏ రకంగా ఉపయోగపడవని, అనిబిసెంటు నడిపినలాంటివి అవసరమని జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచ పర్యటనలో పేర్కొన్నారు. అనేక మంది భక్తి పారవశ్యంలో మునిగి స్థోమతకు మించి ఖర్చుచేసి అశాంతి పాలవుతున్నారు. రాష్ట్రపతులు, ప్రధానులు, మంత్రులు, గవర్నరులను తెలివిగల వారుగ సమాజం పరిగణిస్తుంది. కాని వారెే దేవాలయాల చుట్టూ తిరగడంతో, ఆ దేవుని వలనే వారా స్థాయికి ఎదిగారని సామాన్యులు అనుకోవడం సహజం. వారిని స్ఫూర్తిగా తీసుకుని రోజు వారి కూలి కూడ అప్పుచేసి తిరుపతి వెళ్లడం చూస్తున్నాం. దైవం ఉంటె అణువణువునా ఉంటాడనే విషయం మరచి మూఢ నమ్మకాలకు లోనవుతున్నారు. అటువంటి వారిని అసరా చేసుకుని వాస్తు పేరిట భక్తి పేరిట దోచుకునేవారు పెరుగుతున్నారు. భక్తి అనేది మనసుకు సంబంధించింది. ఆదిశంకరాచార్యులు నిన్ను నీవు తెలుసుకోవడమే భక్తి అన్నారు. పిల్లలపై ప్రేమను మనసులో దాచుకున్నట్లే దైవభక్తి కూడ అలాగెే ఉండాలి.
సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img