Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – అనంతపురం : గత ఏడాది ఇదే రోజున దక్షిణ ధ్రువ ప్రాంతంలో తన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన సంగతి విదితమే. ఈ ఘనతను సాధించిన నాల్గవ దేశంగా, చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో దిగిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ విజయానికి గుర్తుగా, భారత ప్రభుత్వం ఆగస్టు 23వ తేదీని ఏటా జరుపుకోవడానికి “జాతీయ అంతరిక్ష దినోత్సవం”గా ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ కోరి మరియు డీన్ ఆచార్య సి. షీలా రెడ్డి నేతృత్వంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి డాక్టర్సి.వి.ఎస్.ఎస్.మనోహర్ కుమార్ చే అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది. వారు భూమి పరిశీలనకు సంబంధించిన స్పేస్ సైన్స్ అప్లికేషన్‌లను వివరించారు. అడవులు, పట్టణ విస్తరణ, వ్యవసాయం మరియు వాతావరణాన్ని పర్యవేక్షించడానికి రిమోట్ సెన్సింగ్ ఎలా సహాయపడుతుందో ఈ ఉపన్యాసం ద్వారా వారు వివరించారు. రిమోట్ సెన్సింగ్‌లో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మరియు కృత్రిమ మేధ ఎందుకు అవసరమో వారు వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య వి.వి.ఎన్ రాజేంద్ర ప్రసాద్ జాతీయ అంతరిక్ష దినోత్సవం గురించి తన విలువైన ఆలోచనలను పంచుకున్నారు. భారతదేశం యొక్క అంతరిక్ష మిషన్ విజయాలను ఆయన మరొక్కసారి గుర్తు చేసి విద్యార్థినీ విద్యార్థులలో స్ఫూర్తి నింపారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపడం నుంచి చంద్రుడిపై ల్యాండింగ్ వరకు పరివర్తన చెందడం మన అదృష్టం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్ అంతరిక్ష పరిశోధనపై క్విజ్‌ను నిర్వహించడంతో పాటు జాతీయ అంతరిక్ష దినోత్సవం కోసం ఎంపిక చేసిన అంశం: “చంద్రుని స్పృశించే క్రమంలో ఎన్నో హృదయాలను స్పృశించిన భారతీయ అంతరిక్ష గాథ” పై చర్చను నిర్వహించింది.
జాతీయ అంతరిక్ష దినోత్సవం అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయాల వేడుకగా మాత్రమే కాకుండా అంతరిక్ష పరిశోధన యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదికగా కూడా పనిచేస్తుందంటూ వక్తలు సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ సి.కృష్ణ ప్రియ, డాక్టర్ పి.సుమలత సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img