ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పోరేట్ కంపెనీలు గత కొంత కాలంగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. తాజా బహుళజాతి టెలీ కమ్యూనికేషన్ సంస్థ నోకియా గ్రేటర్ చైనా అంతటా దాదాపు 2,000 మందిని తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఖర్చులను తగ్గించే ప్రయత్నాలలో భాగంగా యూరప్‌లో మరో 350 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోందని సమాచారం. ఐరోపాలో 350 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంప్రదింపులు ప్రారంభించినట్లు నోకియా ప్రతినిధి ధృవీకరించారు. అయితే గ్రేటర్ చైనాపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. డిసెంబర్ 2023 నాటికి, నోకియా వార్షిక నివేదిక ప్రకారం గ్రేటర్ చైనాలో 10,400 మంది ఉద్యోగులు, ఐరోపాలో 37,400 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు నోకియాకు రెండవ అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశం చైనా. కానీ పాశ్చాత్య దేశాలు 2019 నుండి హువాయ్ ని నిషేధించడం ప్రారంభించిన తర్వాత, నోకియా మరియు ఎరిక్సన్ రెండింటికీ చైనీస్ టెలికాం ఆపరేటర్ల నుండి ఒప్పందాలు తగ్గాయి. గత సంవత్సరం నోకియా ఉద్యోగ కోతలను ప్రకటించినప్పుడు, దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 86,000. అయితే 2026 నాటికి 72,000 ఉ 77,000 మధ్య ఉద్యోగులకు తగ్గించాలని ప్రణాళిక వేసినట్లు సమాచారం. ప్రస్తుతం నోకియాలో 78,500 మంది ఉద్యోగులు ఉన్నారని అధికార ప్రతినిధి చెప్పారు.