Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అడవి జంతువులను వేటాడే ముఠా ఆటకట్టు

జంతు మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వేటగాళ్ళ గుట్టురట్టు

తనిఖీలలో గుర్తించిన పోలీసులు… అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు

వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు. 13 మంది అరెస్ట్, ఏడు ద్విచక్ర వాహనాలు, 150 కిలోల అడవి జంతు మాంసం స్వాధీనం

అల్లూరి జిల్లా అటవీ శాఖ అధికారి సూర్యనారాయణ

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – అడవి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. శుక్రవారం అటవీశాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం మల్కన్ గిరె ప్రాంతం హితుగూడం గ్రామంకు చెందిన ’13మంది’వ్యక్తులు 7 ద్విచక్ర వాహనాలపై 14మూటలతో(గోనె సంచులతో) ‘అడవి గుర్ర గేదె’ఎండిన మాంసం రవాణా చేస్తున్నట్లు జీకే వీధి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జీకే వీధి రహదారి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వస్తున్న ద్విచక్ర వాహనదారులను అడ్డుకొని తనిఖీలు నిర్వహించగా వారి వద్దనున్న సంచులలో అడవి జంతువుల యొక్క నిల్వ మాంసం ఉన్నట్లు గుర్తించిన వారు విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సంచుల్లో ఉన్న మాంసాన్ని అడవి దున్న మాంసంగా నిర్ధారించడం జరిగింది. దీంతో అందుకు బాధ్యులైన 13 మంది ముద్దాయిలను వారి వద్దనున్న ఏడు ద్విచక్ర వాహనాలను అదేవిధంగా వారు రవాణా చేస్తున్న మాంసాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించడం జరిగింది. దీంతో ముద్దాయిలుగా ఉన్న పోదియ మర్కన్, సునీల్ మర్కన్, ముగిందో పొడియామి, మూడ మర్రి, భీమసేన్ మార్కం , వగా పొడియామి, దెబ్బ పొడియమ్మి, చింటూ పొడియామీ, పోదియా సూర, ముక్క పొడియామీ, కేశ సోడి , గంగ మడి, లక్క సోడి అను వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామంతా ఒక వారం కిందట జీకే వీధి పరిధి ఎర్రగడ్డ ఏరియా వచ్చినట్లు(గ్రామం పేరు చెప్పడం లేదు), ఒక కొండలో పాక దగ్గర ఉన్నట్లు పక్కనే ఉన్న గ్రామానికి చెందినవారు(గ్రామం పేరు చెప్పడం లేదు), ‘అడవి గుర్ర గేదె’మాంసం పట్టుకొచ్చి ఇచ్చినట్లు, సదరు మాంసాన్ని తాము తీసుకు వెళ్తున్నట్లు వివరించారన్నారు. సుమారు 400కేజీల మాంసానికి గాను ఎండబెట్టడం వలన ప్రస్తుతం 150 కిలోలుగా ఉందని, వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేసి, ముద్దాయిలను అరెస్టు చేయడంతో పాటు వారి వద్దనున్న ఏడు ద్విచక్ర వాహనాలను, 150 కిలోల ఎండిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని ముద్దాయిలను రిమాండ్ తరలించడం జరిగిందని అటవీశాఖ అధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img