Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాబు షూరిటీ… యువత భవిష్యత్తుకు గ్యారెంటీ

తెదేపా విశాఖ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారావు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- బాబు షూరిటీ యువత భవిష్యత్తుకు గ్యారెంటీ అని తెలుగుదేశం పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుల్లి సుబ్బారావు అన్నారు. పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలోని కుడుము సారి పంచాయతీ లోని వివిధ గ్రామాలలో బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. తూరు బొంగుల, నిమ్మపాడు, కోటగున్నల కాలనీ, చింతలపాడు, గడ్డి బంద, కరకపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలలో ఆ పార్టీ నాయకురాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మత్స్యరాస మణి కుమారితో విచ్చేసిన ఆయన కార్యక్రమాన్ని విదేశించి మాట్లాడుతూ యువత భవిష్యత్తుకు భరోసా చంద్రబాబు అన్నారు. తెదేపా ప్రభుత్వంలో యువతను ఐటీ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, పారిశ్రామికవేత్తలుగా తయారు చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. వైకాపా ప్రభుత్వంలో యువతను మద్యం దుకాణాలలో చిరుద్యోగులను చేసిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దన్నారు. యువత జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉండొద్దా? అని ఆయన ప్రశ్నించారు. అందుకే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావలసిన అవసరం ఉందన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఇదేత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మణి కుమారి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వల్లే గిరిజనులకు గ్రామ స్వరాజ్యం సాకారమైందని, మహిళలకు ఆత్మ గౌరవం దక్కడంతో పాటు, రిజర్వేషన్ ప్రకారం స్థానాలు కేటాయించిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర విజయ రాణి, మచ్చ రాజు, సాంస్కృతిక విభాగం నుంచి నాగబ్బాయి, వర్తన పిన దొర, స్థానిక మండల నాయకులు ముర్ల సత్తిబాబు, పాంగి చిట్టిబాబు, కే అప్పారావు, జర్త నర్సింగరావు, జె బాలరాజు, ఎం నాగేశ్వరరావు, ఎం చిన్నబాబు, తెలుగు మహిళలు గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img