Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

తెదేపా శ్రేణులలో చిగురిస్తున్న ఆశలు

తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనందరావు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు నియోజకవర్గ శాసనసభ స్థానంపై తెదేపా శ్రేణులలో అసలు చిగురిస్తున్నాయని తెదేపా చింతపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెదేపా, జనసేన, బిజెపి కూటమిలో భాగంగా పాడేరు శాసనసభ స్థానాన్ని బిజెపికి కేటాయించారని ఆందోళన చెందుతున్న పాడేరు నియోజకవర్గ తెదేపా శ్రేణులకు నేటి వరకు పాడేరు స్థానాన్ని అటు బిజెపి గాని, ఇటు తెదేపా గాని ఖరారు చేయక పోవడంతో ఏ క్షణాన ఏ పార్టీ పాడేరు నియోజకవర్గంలో తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారో అనే ఆత్రుత పార్టీ శ్రేణులలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో బిజెపి అరకు పార్లమెంటు స్థానానికి, అదేవిధంగా అరకు శాసనసభ స్థానానికి కొత్తపల్లి గీత, రాజారావు పేర్లను ప్రకటించినట్లు కథనాలు రావడంతో పాడేరు స్థానాన్ని తప్పక తెదేపాకు కేటాయించేందుకు మార్గం సుగమం అయినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు పార్టీ నాయకుడు పౌలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img