Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

బెన్నవరం సచివాలయంలో పెన్షన్ లబ్ధిదారులకు మజ్జిగ పంపిణీ

సచివాలయ కన్వీనర్ రమణమ్మ

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పెన్షన్లు పంపిణీ విషయంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆడుతున్న క్రీ నీడలో సమిదలుగా మారి గడచిన నాలుగు రోజులుగా పెన్షన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులు, వితంతువులు, వంటరి మహిళలకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మండలంలోని బెన్నవరం పంచాయతీ సచివాలయ కన్వీనర్ బచ్చల రమణమ్మ చల్లని మజ్జిగ అందించారు. క్రిందటి నెల వరకు ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటవ తారీఖు నుండి 5వ తారీఖు లోపు పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసే ప్రక్రియ జరిగేది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి లోకి రావడం, వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో పాల్గొనే పరిస్థితి లేదు. దీంతో ఈనెల పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాలకే వచ్చి పెన్షన్లు అందుకునే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు వేసవికాలం కావడం, వృద్ధులు, వికలాంగులు సచివాలయాల చెంతకు నడిచి వస్తున్న క్రమంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకూడదనే సంకల్పంతో సచివాలయ కన్వీనర్లు పెన్షన్ లబ్ధిదారులకు చల్లని మజ్జిగ అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు బచ్చల బొజ్జన్న దొర, వైకాపా నాయకులు పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img