Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

వారపు సంతలో మన ఓటు…మన భవిష్యత్తు అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – ప్రజాస్వామ్యం ప్రజల చేతులలో ఉంది, అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకొని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత 18 ఏళ్ల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిపై ఉందని తహశీల్దార్ టి రామకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని లంబసింగి, తాజంగి వారపు సంతలలో రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్ సాగిన చిన్నయ్య పడాల్ ఆధ్వర్యంలో మన ఓటు మన భవిష్యత్తు కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మన ఓటు మన భవిష్యత్తు, ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని నినాదాలు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని గిరి గ్రామాల అభివృద్ధికి తోడ్పడవలసిన అవసరం ఆసన్నమైందన్నారు. మే నెల 13న ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు పద్మ, నాగమణి, పంచాయతీ కార్యదర్శులు గోవింద్, కె పూర్ణచందర్రావు, పాఠశాల ఉపాధ్యాయులు కేపీ రాజు, విద్యార్థిని, విద్యార్థులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img