Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి ఒక్కరూ మెచ్చిన క్యాలెండర్ “విశాలాంధ్ర”

ఎంపీపీ కోరాబు అనూష దేవి

విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా):- ప్రతి ఒక్కరూ మెచ్చిన క్యాలెండర్ ” విశాలాంధ్ర ” అని స్థానిక ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. మంగళవారం తన కార్యాలయం వద్ద వివిధ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీల తో కలిసి స్థానిక విశాలాంధ్ర పాత్రికేయుడు షేక్ ఖాసిం వల్లి ఆధ్వర్యంలో విశాలాంధ్ర 2024 క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలకు, ప్రజలకు సంధానకర్తగా ఉండే పత్రికలు ప్రస్తుతం ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మారాయన్నారు. ఇటువంటి తరుణంలోనూ ప్రజల పక్షాన నిలిచి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను అటు ప్రభుత్వాల, ఇటు అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఏకైక పత్రికగా నేటికీ విశాలాంధ్ర దినపత్రిక విరాజిల్లుతుందన్నారు. ఇటువంటి పత్రిక ద్వారా ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని, తద్వారా ప్రజాప్రతినిధులుగా మాకు, అధికారులకు సమస్యల పట్ల ఎంతో అవగాహన కలుగుతుందన్నారు. పత్రిక ద్వారానే కాక, క్యాలెండర్ రూపకల్పన లోను మంచి ప్రతిభ కనబరుస్తున్న విశాలాంధ్ర క్యాలెండర్ తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు చౌడుపల్లి సర్పంచ్ లలిత, ఎంపీటీసీలు, దాసరి దారలక్ష్మి, చిందాడ జయలక్ష్మి, లువ్వాబు మీనా కుమారి, తాంబేలి మోహన్ రావు, లంబసింగి మాజీ సర్పంచ్ రఘునాథ్, వైకాపా నాయకుడు మచ్చలింగం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img