Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వేతనాలు పెంచకపోతే అంగన్వాడీలు గడ్డి తిని బ్రతకాలా

సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య పడాల్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచకపోతే అంగన్వాడీలు గడ్డి తిని బ్రతకాలా అని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. అంగన్వాడీల సమ్మె 18 వ రోజుకు చేరిన సందర్భంగా ధరల పెరుగుదలకు నిరసనగా అంగన్వాడీలు నోట్లో వరిగడ్డి పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ అంగన్వాడీలతో పాటు వాలంటీర్లు కూడా ప్రభుత్వంపై పోరాటానికి ఇదే అదునని ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎన్నికల కమిషన్ కోర్టు ఆదేశాల ప్రకారం వాలంటీర్లను తొలగిస్తారని అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. అంగన్వాడీల పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 60 వేల మంది గ్రామ వాలంటీర్లు తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారన్నారు. నెలకు 18000 జీతం ఇచ్చి గ్రామ సచివాలయం లోకి కలుపుతామని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారన్నారు. వారు చేస్తున్న పోరాటానికి ఇదే సరైన సమయమని, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని, కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే అవకాశం ఉందని, అందుకని వారు కూడా ఉద్యమించేందుకు ఇదే సరైన సమయమని, జగన్మోహన్ రెడ్డి నియమించిన వాలంటీర్లు కాబట్టి నోరు మెదపకపోతే బజారున పడతారని ఆయన హితవు పలికారు. కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఇప్పటికే పోరాటం చేస్తున్నారని, కలిసికట్టుగా అందరూ పోరాటంలోకి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ఇప్పటికే అంగన్వాడీలు, ఆశ, సిహెచ్ డబ్ల్యూ, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ, మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు, కేజీబీవీ, సాక్షరభారతి టీచర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వర్కర్లు ఇలా అనేక తరగతులు వాళ్ళు రోడ్లమీదకు వచ్చి పోరాటం చేస్తున్నారని, ఇదే అసలైన సమయమని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడే, పోట్లాడే, పోరాటం చేసే అవకాశం ఇవ్వరని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బేషజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి దిగివచ్చి సమస్యలు పరిష్కారం చేసేవరకు అన్ని తరగతుల వారు ఉద్యమాలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు పెంటమ్మ, రాములమ్మ, లక్ష్మి ప్రసన్న, సత్యవతి, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img