Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పర్యటనను జయప్రదం చేయండి

మండల కో ఆప్షన్ సభ్యుడు నాజర్ వల్లి

విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అరకు పార్లమెంట్ సమన్వయకర్త పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చింతపల్లి మండల పర్యటన ను జయప్రదం చేయాలని వైకాపా చింతపల్లి మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని కొమ్మంగి పంచాయతీ లోని జర్రి గొంది, లబ్బు గుంట
గ్రామాలకు 80 లక్షలు రూపాయల నిధులతో నిర్మించిన సిమెంటు రహదారుల పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేయనున్నారని, అదే క్రమంలో
మధ్యాహ్నం.02. గంటలకు చింతపల్లి ఎంపీ డివో కార్యాలయ ప్రాంగణంలో
వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో. ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డులకు ఎంపికైన వాలంటీర్లకు పురస్కారాలను అందజేయనున్నారని ఈ కార్యక్రమాలకు జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ లు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ లు, సర్పంచులు, AMC చైర్మన్, మండల బీసీ డైరెక్టర్,మండల సచివాలయం కన్వీనర్ లు, నామినేటెడ్ పదవిలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, వార్డు సభ్యులు, గృహసారదులు, హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img