Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఘనంగా అడవి రాజబాబుల పండగ

కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న పర్వదినం.

అన్న సమారాధన కార్యక్రమానికి తరలివచ్చిన భక్తజనం.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అడవి రాజుబాబుల పర్వదినాన్ని స్థానిక నెయ్యల వీధి వాసులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గడచిన కొన్నేళ్లుగా సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్న ఈ పర్వదినం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక నెయ్యిల వీధి అధ్యక్ష కార్యదర్శులు ఇంటి యేసు, ఆబోతు కొండబాబు లా ఆధ్వర్యంలో ఆ కుల పెద్ద పి కామేశ్వరరావు సమక్షంలో జోడు మామిళ్ళ వృక్షాల చెంత ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పూజాదికాలు నిర్వహించి ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో భక్తులు, అభిమానులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆ కుల సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img