Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

సంత షెడ్లను సద్వినియోగం చేసుకోండి

సర్పంచ్ పుష్పలత

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చిరు వ్యాపారులు వారపు సంత షెడ్లను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. పంచాయతీ మరియు నాబార్డ్ సహకారంతో నిర్మించిన సంత షెడ్లను బుధవారం ఆమె స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు దాసరి ధార లక్ష్మి తో కలిసి చిరు వ్యాపారులకు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరిగిన జనాభా, వ్యాపారుల కారణంగా మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తిన నేపథ్యంలో నాబార్డు సహకారంతో పంచాయితీ ద్వారా సంత షెడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. వాటిని ఈరోజు వ్యాపారులకు కేటాయించడం జరిగిందన్నారు. వ్యాపారులంతా సమన్వయంతో ఈ షెడ్లను సద్వినియోగం చేసుకొని వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డ్ సభ్యులు ఎర్రం శెట్టి వెంకటేశ్వరమ్మ,, వసుపరి వెంకట లక్ష్మి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img