Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పేరుకు పౌష్టికాహారం… తిన్నా, తాగినా ప్రాణాంతకం

అంగన్వాడీ కేంద్రాలలో కుళ్ళిన గుడ్లు, ఉబ్బిన పాల ప్యాకెట్లు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం భుజించినా, సేవించినా ప్రాణాంతకంగా మారుతుంది. మండలంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా సకాలంలో అందించవలసిన పౌష్టికాహారాన్ని పలు అంగన్వాడీ కేంద్రాలలో ఆయా అంగన్వాడి కార్యకర్తల నిర్లక్ష్యం కారణంగా కాలం చెల్లిన కుళ్లిన గుడ్లు, పాల ప్యాకెట్లతో పౌష్టికాహారం కాస్థా ప్రాణాంతకంగా మారుతుంది. మండలంలోని మారుమూల ప్రాంత అంగన్వాడీ కేంద్రాలలోనే గాక, మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలలోనూ కుళ్ళిన గుడ్లు, చెడిపోయిన పాల ప్యాకెట్ల కారణంగా అంగన్వాడి కేంద్రాలు దుర్గంధ భరితంగా దర్శనమిస్తున్నాయి. పౌష్టికాహారం పేరిట చిన్నారులకు ఐసిడిఎస్ ద్వారా సరఫరా చెయ్యవలసిన గుడ్లలో, పాల ప్యాకెట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వలన, అదే క్రమంలో సమయం మించిన తర్వాత సరఫరా చేయడం వలన, అవగాహన లేని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు వాటిని తీసుకుని అస్వస్థతకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, చెడిపోయిన పౌష్టికాహారం తీసుకోవడం వలన ప్రాణాంతకంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించవలసిన ఆ శాఖ ఉన్నత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో అంగన్వాడీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కుళ్ళిన గుడ్లు, కాలం చెల్లిన పాల ప్యాకెట్లు, పురుగులు పట్టిన బియ్యం, పప్పుల నిల్వలతో కొన్ని అంగన్వాడీ కేంద్రాలు దుర్గంధాన్ని వెదజల్లుతూ వ్యాధులను సంక్రమింప చేసే దిశగా దర్శనమిస్తున్నాయి. వాటిని పర్యవేక్షించవలసిన సూపర్వైజర్లు సైతం ఆ దిశగా కృషి చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని ప్రాణాంతకం కాకుండా అందించేందుకు కృషి చేయాలని ఈ ప్రాంతీయలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img