Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పాడేరు నియోజకవర్గ టికెట్ భాగ్యలక్ష్మి కేటాయించాలి

వైకాపా మండల అధ్యక్షుడు రవి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- వైకాపా పాడేరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిత్వం కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కి కాకుండా వేరెవరికి కేటాయించిన ఐదు మండలాలలో ఉన్న పార్టీ మండల అధ్యక్షులమంతా మూకుమ్మడిగా రెబల్స్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించిన భాగ్యలక్ష్మి శాసన సభ్యురాలిగా గడచిన నాలుగున్నరేళ్లుగా అలుపెరుగని సైనికురాలిగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన ప్రతి పనిని చిత్తశుద్ధితో నిర్వహించారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 97 సచివాలయాల పరిధిలోను ప్రతి గడపను సందర్శించిన శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి అన్నారు. ఈ నాలుగున్నరేళ్ళు ఉనికి కోసం మాత్రమే పార్టీలో పని చేసిన అనేకమంది నేడు పార్టీ టిక్కెట్లకై పైరవీలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కాకముందే తమకే టికెట్ కేటాయించారని పలువురు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న నాయకురాలిగా, అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా పార్టీని నడిపిస్తున్న భాగ్యలక్ష్మి కే అధిష్టానం పార్టీ టికెట్ కేటాయిస్తుందని తమకు నమ్మకం ఉందని అలా కాకుండా వేరేవరికీ కేటాయించిన తామంతా రెబల్ గా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయాన్ని అధిష్టానం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img