Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నమ్మినవారికి ప్రాణం ఇచ్చే ప్రజలు గిరిజనులు

అల్లూరి జిల్లాలో వైకాపాకు హ్యాట్రిక్ విజయాలు
విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
మంచి చేసిన అధినేతకు కష్ట కాలంలో అండగా ఉందాం
వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలు, పాడేరు శాసనసభ్యులు భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఎవరు ఊహించని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు వెలువడినప్పటికీ అల్లూరి జిల్లాలో అటు అరకు పార్లమెంట్, ఇటు అరకు, పాడేరు శాసనసభ స్థానాలను వైకాపా కైవసం చేసుకోవడం ఆశించిన పరిణామమేనని వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలు, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు, మన్య ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలకు ఎంతో తేడా ఉంటుందన్నారు. నమ్మిన వారికి ప్రాణం ఇచ్చే ప్రజలు గిరిజనులు అన్నారు. రాజకీయ విశ్లేషకులకు, రాజకీయ పార్టీలకు, ప్రజలకు అంతు చిక్కని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫలితాలలో అనేక జిల్లాలలో వైకాపాకు ఒక్క స్థానం కూడా దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితులలోనూ అల్లూరి జిల్లాలో అరకు పార్లమెంట్ సహా అరకు, పాడేరు శాసనసభ స్థానాలలో వైకాపా విజయం సాధించడం చరిత్ర అన్నారు. 2014 నుంచి 2019, 2024 ల లోను అభ్యర్థులు ఎవరైనప్పటికీ మూడు దఫాలుగా ఈ నియోజకవర్గాలలో వైకాపా విజయాలు నమోదు చేస్తూ వస్తుందన్నారు. నేడు హ్యాట్రిక్ విజయాలతో అరకు పార్లమెంట్లో గుమ్మ తనూజ రాణి, అరకు, పాడేరు శాసనసభ స్థానాలలో రేగం మచ్చలింగం, మత్స్యరాస విశ్వేశ్వర రాజు లను గెలిపించు కోవడం జరిగిందన్నారు. ఉపకారికి అపకారం చేసే ఆలోచన గిరిజనులు ఏనాడూ చేయరన్నారు. మన్య ప్రాంతంలో వైకాపాకు వచ్చిన ఫలితాలే అందుకు ఉదాహరణ అన్నారు. వైకాపా ప్రభుత్వంలో పథకాలు పొందిన మన్య ప్రాంతంలోని గిరిజనులందరూ వైకాపా వెంటే ఉన్నారని అల్లూరి జిల్లాలో ఫలితాలు వెల్లడించా యన్నారు. వైకాపా ప్రభుత్వంలో గడచిన ఐదేళ్లు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలతో పాటు గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరించి పథకాలు అందుతున్న తీరును తెలుసుకోవడంతోపాటు అందని వారికి ఎందుకు అందడం లేదో తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించి పథకాలు అందజేసిన తీరును మెచ్చుకున్న మన్యవాసులు పొందిన లబ్ధికి కృతజ్ఞతగా వైకాపాకు విజయం చేకూర్చారన్నారు. ఈ విజయంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. ప్రజా ప్రతినిధులే గాక, నామినేటెడ్ పదవులలో ఉన్నవారు నాయకులు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా శ్రమించడం వలన రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫలితాలకు భిన్నంగా మన్యంలో ఫలితాలు నమోదయ్యాయన్నారు గడచిన 10 ఏళ్లుగా వైకాపా వెంట ఉన్న గిరిజనులు మరో ఐదేళ్ల పదవీ కాలానికి గాను వైకాపా అభ్యర్థులకు విజయం అందించారన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులంతా సంయమనముతో ఉండాలన్నారు. ఎక్కడ ఎటువంటి నిరుత్సాహానికి లోను కాకుండా పార్టీ అధినేతకు అండగా ఉంటూ అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫలితాలకు భిన్నంగా అల్లూరి జిల్లాలో విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img