Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మారుమూల గ్రామాల్లో రహదారుల సదుపాయాలు కల్పించాలి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆదివాసీ గిరిజన చట్టాలు, హక్కులు పక్కాగా అమలు చేయాలని జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కిలో రాజన్ అన్నారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు, పారికలు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బేరా ఈశ్వరరావు ల ఆధ్వర్యంలో పారికలు గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామ పెద్దలతో మమేకమై గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు ప్రధానంగా రహదారి, సామాజిక భవనం కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన
మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక
ఎన్నికల్లో జనసేన, తెదేపాలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం స్థాపించిన తరవాత మారుమూల గిరిజన గ్రామాలలో ముఖ్యంగా అవసరమైన రహదారి సదుపాయాలతో పాటు అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. కుల, మతాలకు, సామాజిక న్యాయం చేసి రాజకీయ సాధికారత కల్పిస్తేనే సమాజం, సమాజ నిర్మాణానికి సంబంధించి అభివృద్ది జరుగుతుందన్నారు.
5 వ షెడ్యూలు లో రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు ఉన్నప్పటికీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. గిరిజన హక్కులు చట్టాలపై అవగాహన కలిగి అవినీతి పై రాజీలేని పోరాటం చేయాలన్నారు. ప్రతి ఒక్కరిలో రాజకీయ చైతన్యం రావాలన్నారు. ప్రశ్నించే, పోరాడే తత్వం ఉన్నపుడే హక్కులు చట్టాలు కాపాడుకోగలమన్నారు. వైకాపా వచ్చిన నాటి నుంచి నేటి వరకు యువతకు ఒక ఉద్యోగం లేదని మారుమూల గ్రామాల్లో చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. బెంతు ఒరియా, బోయ వాల్మీకిలను ST జాబితాలో చేర్చితే ఆదివాసీ గిరిజన ప్రజలకు నష్టం జరుగుతుందని, జీవో నెంబర్ 3 ఆదివాసీ గిరిజన ప్రజలకు గుండె కాయ వంటిదని వీటన్నింటినీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ గ్రామస్తులు జనసేన పార్టీలో చేరుతున్నామన్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వంతల రాజారావు, వంతల శేఖర్, గ్రామ పెద్దలు ముర్ల లక్ష్మణ్ రావు, పోత్తురి కామరాజు, దేసాగిరి ధర్మరాజు, జర్త చిన్నబ్బాయి, జర్త సత్యవతి, జర్త వినయ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img