Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చిరు వ్యాపారులు వారపు సంత షెడ్లను సద్వినియోగం చేసుకోవాలి

నాబార్డ్ డీజీఎం అబువరాజన్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- వారపు సంతలకు వచ్చే చిరు వ్యాపారులు సంత షెడ్ లను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ డీ జీ ఎం అబువ రాజన్ అన్నారు. నాబార్డ్ నిధులు 15 లక్షల రూపాయలు, పంచాయతీ నిధులు 5 లక్షల రూపాయలతో గిరిజన వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు నెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్మించిన 40 దుకాణాల సంత షెడ్ లను నాబార్డ్ ఏజీఎం సమంత్ కుమార్ తో కలసి శుక్రవారం చింతపల్లి వచ్చిన ఆయన స్థానిక తహసిల్దార్ లచ్చపాత్రుడు, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి, వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొడ్డేటి జోగేశ్వరరావు, పెదిరెడ్ల బేతాళుడు లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా వారపు సంత స్థలం పెరగకపోవడం వలన రహదారికి ఇరువైపులా దుకాణాలు వేసుకునే చిరు వ్యాపారుల వలన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తమ దృష్టికి రావడంతో ఆ సమస్యను పరిష్కరించాలనే గిరిజన వికాస్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ ఆలోచన మేరకు సంత షెడ్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. 15 లక్షల రూపాయల నాబార్డ్ నిధులను వెచ్చించి ఈ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. వాటికి పంచాయతీ నిధులు 5 లక్షల రూపాయలు కలిపి మొత్తం 20 లక్షల రూపాయల నిధులతో ఈ సంత షెడ్ లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, 40 మంది చిరు వ్యాపారులు వీటి ద్వారా ఉపయోగం పొందవచ్చని తెలిపారు. దీనివలన రహదారికి ఇరువైపులా దుకాణాలు వేసుకుని ఇబ్బంది పడే చిరు వ్యాపారులకు ఈ సంత షెడ్ లను కేటాయించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు ఆయన సూచించారు. నాబార్డ్ నిధులతో పూర్తి చేసుకున్న ఈ సంత షెడ్ లను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని అదే క్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తహసిల్దార్ లచ్చపాత్రుడు, వర్తక సంఘం నాయకుడు బేతాళుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వీఆర్వో కృష్ణారావు, గిరిజన వికాస్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img