Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

క్రీడలు మానసిక ఉల్లాసానికే గాక, శారీరక దారుడ్యానికి, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం

యూనిట్ క్రికెట్ కప్ సొంతం చేసుకున్న టీచర్స్ జట్టు.

దిగ్విజయంగా ముగిసిన చింతపల్లి సీజన్ 2 క్రికెట్ పోటీలు

బహుమతులు ప్రధానం చేసిన అధికారులు. ప్రజాప్రతినిధులు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుడ్యానికి, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయని అధికారులు, ప్రజా పతినిధులు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ది యూనిటీ కప్ చింతపల్లి సీజన్ 2 అంతర్రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారంతో ముగిసాయి. టోర్నీ నిర్వాహకుడు దొండ చినబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిటీ కప్ సీజన్ 2 క్రికెట్ టోర్నీకి అల్లూరి జిల్లాలో విశేష స్పందన లభించింది. సోమవారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా చింతపల్లికి చెందిన టీచర్స్ జట్టు, పాడేరుకు చెందిన ఆర్ఆర్ఆర్ జట్టు ఫైనల్ కి చేరుకోగా తుది పోరులో టీచర్స్ జట్టు విజయం సాధించి, ది యూనిటీ కప్ టైటిల్ ని కైవసం చేసుకుంది. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా చింతపల్లి ఎస్సై అరుణ్ కిరణ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం విజయభారతి పాల్గొనగా వారితోపాటు టోర్నీ నిర్వహణకు స్పాన్సర్ చేసిన ప్రముఖుల చేతులమీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మొదటి స్థానంలో నిలిచిన టీచర్స్ జట్టుకు 50వేల రూ, ద్వితీయ స్థానంలో నిలిచిన పాడేరు ఆర్ఆర్ఆర్ జట్టుకు 20 వేల రూ. నగదు బహుమతితో పాటు ఇరు జట్లకు ట్రోపీలు, ఇరు జట్ల సభ్యులకు షీల్డ్ మరియు మెడల్స్ లను అందజేశారు. బహుమతులను స్పాన్సర్స్ చేసిన వారిలో చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత, హేమంత్ దంపతులు 10 వేలు, చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూష దేవి 20 వేలు, ఎంపీటీసీ దాసరి దారలక్ష్మి, మత్స్యరాజు దంపతులు 10వేలు, స్థానిక ఇంజనీరింగ్ శాఖ జేఈ లు జ్యోతి బాబు, లోకేష్ లు 20 వేలు, దొండ నాగరాజు 10 వేలు, ఆహా రెస్టారెంట్ యాజమాన్యం ప్రసాద్, నాగేంద్రలు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అదే క్రమంలో నల్లల శివ సాయి (వీడిఎస్ సౌండ్ సిస్టం) విన్నర్ ట్రోఫీ, కేపీ రాజు ఆర్థిక సహాయంతో రన్నర్ ట్రోఫీ అందజేయగా, పోటీలలో వివిధ విభాగాలలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు పలు బహుమతులను పలువురు స్పాన్సర్ చేశారు. కాగా ఫైనల్ మ్యాచ్లో ఇరుజట్లకు భోజన సదుపాయాన్ని చింతపల్లి సాయి నగర్ వీధికి చెందిన యువ జీవన సేవా సంఘం అధ్యక్షులు కదుల్ల మధుసూదనరావు బృందం సభ్యులు అందజేయగా, క్రీడాకారులకు ఎనర్జీ డ్రింకులను కొమ్మంగి గ్రామానికి చెందిన చల్లంగి బ్రదర్స్ అందించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకుడు చినబాబు మాట్లాడుతూ టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన వివిధ అవసరాలను గ్రామంలోని యువత సమకూర్చారని, వివిధ విభాగాల బహుమతులకు ఆర్థిక తోడ్పాటునందించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img