పెదవలస గ్రామ సచివాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించిన సర్పంచ్.కృష్ణవంశీ, వైస్ ఎంపీపీ.
సప్పగెడ్డ ఆనందరావు
విశాలాంధ్ర – జీకే వీధి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ అన్నారు. పెదవలస గ్రామ సచివాలయంలో జీకే వీధి మండల వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనందరావు తో కలసి గురువారం ఆధార సేవలు ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఆధార్ సేవలు పెదవలస పంచాయతీ ప్రజలందరూ సద్వినియోగపరుచు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెదవలస సచివాలయ సిబ్బంది, మహిళా పోలీస్, డి ఎ, వెల్ఫేర్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వాలంటీర్ లు, సచివాలయ కన్వీనర్ శంకర్, వార్డు సభ్యులు రాము, తదితరులు పాల్గొన్నారు.