Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని తెలుసుకునే శిక్షణను సద్వినియోగం చేసుకోండి

క్షేత్రస్థాయి వైద్య సిబ్బందికి సూచిస్తున్న లోతుగెడ్డ వైద్యాధికారి లక్ష్మీకాంత్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని తెలుసుకునే శిక్షణ పొంది వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో రోగులు, గర్భిణీలు, బాలింతలకు సకాలంలో సరైన హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలని లోతుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లక్ష్మీకాంత్ అన్నారు. హైదరాబాదు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం మండలంలోని లోతుగెడ్డ, కోరుకొండ, లంబసింగి, తాజంగి తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కచ్చితంగా కనుగొనే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. లోతుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యాధికారి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రోగులు, గర్భిణీలు, బాలింతలతో పాటు అవసరమైన వారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కనుగొనేందుకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కచ్చితంగా తెలుసుకునేందుకు ఇటువంటి శిక్షణలో ఎంతగానో దోహదపడతాయన్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని తద్వారా ఆయా పీ హెచ్ సీ ల పరిధిలోని ప్రజలకు ఈ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదు నుండి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు సర్వీస్ ఇంజనీర్ సాయి తేజ, కార్యక్రమ నిర్వాహకడు జగతి రాజు, వెంకట్, మనీత్, ఎం. ఎల్ హెచ్ పి సౌజన్య, అన్వర్, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img