Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

అదుపుతప్పి సిమెంట్ లారీ బోల్తా. డ్రైవర్ మృతి

బోడ కొండమ్మ తల్లి ఘాట్ రోడ్ లో ఘటన

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి ఘాట్ రోడ్లో అదుపు తప్పిన సిమెంటు లారీ పల్టీలు కొట్టింది. సీలేరు ప్రాంతం నుండి గూడెం చింతపల్లి, లంబసింగి కొండ రహదారి మీదుగా మైదాన ప్రాంతానికి వెళ్తున్న సిమెంట్ లారీ బోడ కొండమ్మ తల్లి ఆలయ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం గురువారం ఎన్టీఆర్ జిల్లా జగ్గంపేట నుంచి నర్సీపట్నం, చింతపల్లి, గూడెం కొత్త వీధి మీదుగా సీలేరు వెళ్లిన సిమెంట్ లారీ సిమెంట్ అన్లోడ్ చేసి జగ్గంపేట తిరుగు ప్రయాణంలో గురువారం అర్ధరాత్రి తురబాడ గ్రామ సమీపంలో గల ప్రమాదకరమైన మలుపు వద్ద సిమెంటు లారీ అదుపుతప్పి లోయలోకి పల్టీ కొట్టింది.. సిమెంటు లారీలో డ్రైవర్ రత్నరాజు (32) సంఘటన స్థలంలోనే మృతి చెందగా, సహాయకుడు కే కొండబాబు తీవ్రంగా గాయపడ్డాడు. చింతపల్లి, నర్సీపట్నం ల వైపు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు సంఘటనను గుర్తించి తీవ్ర గాయాల పాలైన కొండబాబును అంబులెన్స్ సహాయంతో డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img