Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎస్సీ కార్పొరేషన్ కి కేటాయించిన నిధులు ఏజెన్సీ దళితుల అభివృద్ధికి వెచ్చించరా

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు చిన్నయ్య పడాల్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధులు ఏజెన్సీ దళితుల అభివృద్ధికి వెచ్చించరా అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. స్థానిక అంబేద్కర్ దళిత వాడకు వెళ్లిన ఆయన, వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, ఇక్కడ జీవిస్తున్న దళితులకు ఏ ప్రభుత్వము చేసిన మేలేమి లేదన్నారు. పేరుకే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దళితవాడ అని, గడచిన ఐదు దశాబ్దాల క్రితం చుట్టుపక్కల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఎస్సీ దళితులు అందరూ ఒకే చోట ఉండాలని ఇక్కడ స్థలాలు ఇచ్చి ఉంచడం జరిగిందని వివరించారు. అయితే ఐదు దశాబ్దాల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాలు తప్ప నేటి వరకు వారి అభివృద్ధికి ఏ ప్రభుత్వము సహకరించిన దాఖలాలు లేవన్నారు. కుటుంబాలు పెరిగినప్పటికీ నాడు కేటాయించిన ఒకే ఇంటి స్థలంలో మూడు నుంచి ఐదు కుటుంబాల వారు ఉంటున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇళ్ల స్థలం కోసం పట్టించుకోవడంలేదన్నారు. ఉదాహరణకు ఉప్పాటి మహాలక్ష్మి కి ఆరుగురు కుమారులని వీరికి ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున 10 మంది పిల్లలు ఉన్నారని, పుట్టిన పిల్లలకు పెళ్లిళ్లు చేసి వేరే ఇంటి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నారు. నివసిస్తున్న గృహాలు కూడా మంచివి కావని పైన కవర్లు కట్టుకొని జాతర్లకు చిరు వ్యాపారస్తులు వచ్చినట్టు సరైన గోడలు, తలుపులు కూడా మంచివి కావన్నారు. పిల్లలు చదువుకొని ఉపాధి లేక స్థానికంగా ఏ కూలి దొరికితే ఆ కూలికి వెళ్లి బతుకుతున్నారని పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న వారు స్థానిక దళితులేనని వివరించారు. చదువుకున్న దళిత యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ఆ నిధులు ఏమవుతున్నాయని మండిపడ్డారు. చదువుకున్న యువతీ, యువకులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరారు. ఇళ్ల స్థలాల కోసం ఇబ్బంది పడుతున్న అంబేద్కర్ కాలనీ వాసులకు ఆ పక్కనే ఉన్న సిల్క్ ఫారం స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప వీరి సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదన్నారు. ఒకసారి అధికార ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు ఓట్ల కోసం పోటీ పడే కన్నా ఈ కాలనీలో తిరిగి కాలనీ వాసుల ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటే మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వీపర్ నూకరాజు, చిన్నతల్లి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img