Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పాంగి సౌభాగ్య కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాల ఆదుకోవాలి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంత పోకడ విడనాడాలి.

మరణించిన అంగన్వాడి కుటుంబంలో తక్షణమే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

సౌబాగ్య చిత్ర పటానికి అంగన్వాడీ లతో కలిసి నివాళులర్పించిన సిఐటియు జిల్లా నాయకుడు ధనుంజయ్.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ లలో సమ్మె లో పాల్గొని అస్వస్థతకు గురై విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన పాంగి సౌబాగ్య(25) కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాల ఆదుకోవాలని సీ ఐ టీ యూ జిల్లా నాయకుడు పాంగి. ధనుంజయ్ అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ కార్యాలయ ఆవరణలో గడచిన 40 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ ల నిరవధిక సమ్మె దీక్షా శిబిరం వద్ద మృతురాలు సౌభాగ్య చిత్రపటానికి అంగన్వాడీలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లతో పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ పలువురు అంగన్వాడీ ల మరణాలకు కారణమవుతుందన్నారు. సమ్మెలో పాల్గొని అస్వస్థతకు గురై మరణించిన ముంచంగి పుట్టు మండలం దారెల గ్రామ అంగన్వాడి కార్యకర్త సౌభాగ్య కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాల ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే 40 రోజులుగా ఈ ప్రభుత్వం వారిపై అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుందని ఆయన మండిపడ్డారు. గడచిన 40 రోజులుగా రోడ్లపై బైఠాయించి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నారీమణుల పోరాటం వృధాగా పోదని ఆయన జోష్యం చెప్పారు. అంగన్వాడీల ఆశయాలు సాధించేవరకు పోరాటాన్ని కొనసాగించి సమస్యలు పరిష్కారం చేసుకుందామని అంగన్వాడీలకు మనో ధైర్యాన్ని కలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నియంత పోకడలను విడనాడి అంగన్వాడీల 11 డిమాండ్లు తక్షణం పరిష్కరించాలని లేనిపక్షంలో రాబోవు సార్వత్రిక ఎన్నికలలో వైశాఖ ప్రభుత్వం సంగతి ఏంటో తేల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల సహనం పరీక్షిస్తుందని, ఎన్ని దఫాలుగా అంగన్వాడీల సమస్యలపై చర్చలకు పిలిచినప్పటికీ ప్రధాన సమస్యను పక్కన పెట్టి ఈ ప్రభుత్వం అంగన్వాడీలను మోసం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కమిటీలతో జూన్ లో జీతాలు పెంచే నిర్ణయం తీసుకుంటామనడం విడ్డూరంగా ఉందన్నారు. రెన్యువల్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి పదవి ఏమైనా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికలలో విజయం ప్రజలు నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి గుర్తేరగాలన్నారు. రాజ్యాంగబద్ధమైన సమ్మెను భగ్నం చేసే ఆలోచన చేయకుండా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని లేకుంటే ఫలితాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు పెంటమ్మ, కంకిపాటి రాములమ్మ, వరలక్ష్మి, అక్కమ్మ, వరలక్ష్మి , కుమారి , నీలమ్మ, దేవుడమ్మ, అధిక సంఖ్యలో అంగన్వాడి లు, మినీ అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img