Friday, June 14, 2024
Friday, June 14, 2024

గిరిజనులతో పాటు దళితులను అక్కున చేర్చుకున్న ప్రభుత్వం వైకాపా

పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- గిరిజనులతో పాటు దళితులను అక్కున చేర్చుకున్న ప్రభుత్వం వైకాపా అని వైకాపా అరకు పార్లమెంటు సమన్వయకర్త, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక అంబేద్కర్ (ఎస్సీ) కాలనీలో ఆ కాలనీ అధ్యక్షుడు మసురుపాము ధారబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సిమెంట్ రహదారి, మురుగు కాలువ నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, ఎంపీపీ కోరాబు అనూష దేవి, జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య లతో కలిసి ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆ కాలనీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు చింతాడ జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తరతరాలుగా మన్య ప్రాంతంలో నివసిస్తున్న దళితులకు గతంలో పరిపాలించిన ఏ ప్రభుత్వము వారి సమస్యలను పట్టించు కోలేదన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజనులతో పాటు, గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నదళితుల సంక్షేమం కోసం ఆలోచన చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 1/70 చట్టం కారణంగా ప్రభుత్వం ద్వారా తమకు గృహాలు మంజూరు అయ్యే అవకాశం లేనందున తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరడంతో తమ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసిందన్నారు. గతంలో కొద్దిమందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించడం వలన ఆ ఇళ్లలోనే రెండు మూడు కుటుంబాలు నివసిస్తున్న పరిస్థితి ఉందని తమ దృష్టికి వచ్చిన వెంటనే తమ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వై వి సుబ్బారెడ్డి 50వేల రూపాయల చెక్కును అందించడం జరిగింది అన్నారు. దానికి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, తాను కలసి కొంత నగదుతో నేడు స్థానిక నిరుపేద దళితులకు సుమారు 200 సిమెంటు రేకులు అందించడం జరుగుతుందన్నారు. ఎస్సీ కాలనీ అభివృద్ధి, దళితుల సంక్షేమం కోసం ఎంపీటీసీ, సర్పంచ్ లు వారి స్థాయిలలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల నుంచి దళితులకు ఆర్థిక సహకారం అందించాలని మంత్రి మేరుగ నాగార్జున ను కలసి విన్నవించడం జరిగిందని అవన్నీ నేడు సాకారం అవుతున్నాయన్నారు. 2019లో ఎస్సీ కాలనీలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే ఆ సమస్య పరిష్కారానికి ఐదు లక్షల రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ప్రజాక్షేత్రంలో విజయం సాధించిన ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఈ నాలుగేళ్ల 9 నెలల పాటు శ్రమించారని, ప్రతి అడుగు ప్రజల కోసమే వేశామన్నారు. అవినీతి లేని సంక్షేమ పాలనను అందించ గలిగామన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలంతా మరోమారు దీవించాలని, వైకాపాకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. అనంతరం దళితులకు ఆమె సిమెంట్ రేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, నర్సింగరావు దంపతులను దుస్సాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దురియ పుష్పలత, ఎంపీపీ అనూష దేవి, జడ్పిటిసి బాలయ్య, ఎంపిటిసిలు ధారలక్ష్మి, మండల అధ్యక్షుడు , డిసిసిబి డైరెక్టర్ మోరి రవి, జెసిఎస్ మండల కన్వీనర్ పాంగి గుణబాబు, వైస్ ఎంపీపీలు గోపీ నాయక్ శారద, సాగిన వెంగళరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మీరా, కోఆప్షన్ సభ్యులు నాజర్ వలీ, వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచులు: ఎంపీటీసీలు, ఎస్సీ సెల్ మహిళా అధ్యక్షురాలు గెడ్డం సోమరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు పెదపూడి నాగేశ్వరరావు, దానియేలు, చిందాడ సత్యనారాయణ, దారబాబు అప్పారావు, పార్వతి, శివ, అప్పలరాజు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img