Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

యువ రైతు మృతికి మహారాష్ట్ర పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి…

– ఏ.పి. రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డి పల్లి అప్పలరాజు…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.22.02.2024ది. యువ రైతు శుభకరన్ సింగ్ మృతికి కారణమైన మహారాష్ట్ర పోలీసులు పై తక్షణమే క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురువారం రైతు సంఘం, కార్మిక సంఘాలు తో కలిపి వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సి.పి.ఐ., ఏ.పి.రైతు సంఘం నేత రెడ్డిపల్లి మాట్లాడుతూ భారతదేశంలో కర్షక, కార్మికులను అణగదొక్కే నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు శాంతియుతంగా నిరసనను తెలియజేయడానికి మహారాష్ట్ర నుండి ఢిల్లీకి వెళ్తు0టే, పోలీసులు అతికిరాతంగా తుపాకీ తూటాలతో రైతుల పై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 21సంవత్సరాల యువరైతు శుభకరన్ సింగ్ బలయ్యాడన్నారు. మరి కొందరు రైతులు గాయాలతో హాస్పిటల్లో పాలయ్యారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తూ వారి బతుకులను రోడ్డు న పడేసింది అని తెలియజేశారు. అధికార బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల్ని రద్దు చేయాలని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే చట్టాన్ని తీసుకురావాలని రైతులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భంలో, వాటిని నేటికీ కూడా అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారు అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేఖ విధానాల పై సామరస్యంగా ఢిల్లీ వెళుతున్న రైతుల పట్ల విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండిస్తోందని తెలిపారు. రానున్న కాలంలో బిజెపి తగిన మూల్యం చెల్లించుకోవాలన్నారు. అదే విధంగా నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నను, నేటికి వాటిని రద్దు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అన్నారు. అన్నదాతల ఆందోళనలో ప్రభుత్వ తూటాలకు బలైన యువ రైతు శుభకరన్ సింగ్ కు నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి, కారకుల పై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ చంటి, షేక్ ఇక్బాల్, భూపతి క్రాంతి కుమార్, రైతాంగం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img