Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

వాహనాలు విస్తృత తనిఖీలు….

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.23.03.2024ది. రానున్న సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా అనకాపల్లి జిల్లా చోడవరం లో శనివారం పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తూ జల్లెడ పడుతున్నారు. రాజకీయ పార్టీ నేతలు, వారి అనుచరుల కదలికల పై నిఘా వుంచారు. ఓటర్లకు తాయిలాలు ఇచ్చి, గాలం వేసేందుకు సిద్ధమైన నేతలకు కునుకు పట్టకుండా చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం పోలీసులకు అంది0చాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img