Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అవినీతిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రా

చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీకు టిడిపి, జనసేన నేతల సవాల్

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.21.02.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ పరిధిలో అధికార వై.సి.పి.జరిపిన అవినీతిపై బహిరంగ చర్చకు దమ్ముంటే రావాలని, టి.డి.పి. మాజీ శాసనసభ్యులు కె.ఎస్. ఎన్.ఎస్. రాజు, నియోజకవర్గ ఇన్చార్జి బత్తులు తాతయ్య బాబు గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, జనసేన ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ కు బహిరంగ సవాల్ విసిరారు. ప్రైవేటు కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే కె ఎస్ ఎం ఎస్ రాజు మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు మాని ప్రజాసేవ చోడవరం నియోజకవర్గ అభివృద్ధికి అధికార వైసిపి ఎమ్మెల్యే ధర్మ శ్రీ ఏం చేశారో, ఏం చేస్తారు చెప్పాలన్నారు. అధికార పార్టీ పేరు చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర అంగన్వాడి ఆజాల దగ్గర ఉద్యోగాలు వేస్తామని బీసీలు కమిషన్లు తదితర అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు రోడ్లు దుస్థితి ఏ నాయకుడు అవినీతి ఎంత మేర ఉందో రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు చివరకు స్వయంభు విగ్నేశ్వర గౌరీ పరమేశ్వరుల దేవస్థానాలు అభివృద్ధి చేస్తామంటూ, వారి సొంత కార్యక్రమాలకు పలువురు దగ్గర ఎమ్మెల్యే వారి సోదరులు డొనేషన్లకు కక్కుర్తి పడిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయన్నారు. గతంలో టిడిపి అమలుపరిచిన సంక్షేమ పథకాలు, గ్రామీణ రహదారులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర కార్యక్రమాలను అవే జీవోలతోనూ వాటిని మార్చి చూపించుచున్నారు తప్ప, ఏ మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచలేదన్న వాస్తవాన్ని బహిరంగ చర్చలో తేల్చుకుందామన్నారు. మాజీ గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు మాట్లాడుతూ గత పాలక వర్గం 2013 నుంచి 2018 వరకు టిడిపి హయాంలో చెరకు రైతులకు 15 రోజులకోసారి పేమెంట్లు ఇచ్చే వారమని, ఏనాడు కార్మికులకు కర్షకులకు అన్యాయం చేయలేదని తెలిపారు. అధికార వైసిపి హయాంలో స్థానిక ఎమ్మెల్యే వారి సోదరులు మూకుమ్మడిగా ఫ్యాక్టరీలో సుమారు 130 కోట్ల మేర అవినీతి జరిపి ఆ బురదను తమపై జల్లుతున్నారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. జనసేన నేత పి.వి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మ శ్రీ అనేక చోట్ల ముగ్గులు పెట్టి, చిట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ తదితర మోసాలు, మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అందులమెక్కారని అన్నారు. వ్యక్తిగత విమర్శలు మాని చోడవరం లో ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని, వై.సి.పి. నేతల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మరొకసారి టిడిపి, జనసేన అధినాయకులు నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎమ్మెల్యే ధర్మశ్రీ కు తాట తీస్తామని బహిరంగంగా మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నేతలు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img