Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

సినర్జన్ ఫార్మా ప్రమాదంలో గాయపడిన కార్మికుడు మృతి

నాలుగుకి చేరిన మృతుల సంఖ్య
విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి జిల్లా); జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. తాజాగా జార్కండ్‌ రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఓయాబన్‌ కొరాహ్ (24) ఇండస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఆగస్టు 22వ తేదీ అర్ధరాత్రి సినర్జిన్‌ పరిశ్రమలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా ఆ నలుగురు మృతి చెందారు. వీరిలో జార్కండ్‌ రాష్ట్రానికి చెందిన రోయన్‌ అంగీరియా (22) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 24వ తేదీన మృతి చెందగా, అదే రాష్ట్రానికి చెందిన మరో కార్మికుడు లాల్‌సింగ్‌ పుర్తి(21) చికిత్స పొందుతూ 25న మృతి చెందాడు. అలాగే విజయనగరంకు చెందిన కెమిస్ట్‌ కె. సూర్యనారాయణ(35) కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 26న మృతి చెందాడు. ప్రస్తుతం జార్కండ్‌ రాష్ట్రానికి చెందిన ఒయాబన్‌ కోరాహ్ కూడా మృతి చెందాడు. కాగా సినర్జిన్‌లో గాయపడిన నలుగురుకి నలుగురు మృతి చెందారు. అయితే కోరాహ్ మృతిని వెల్లడించకుండా గోప్యంగా ఉంచేందుకు కంపెనీ యాజమాన్యం అధికారులు ప్రయత్నించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకు ముందు ముగ్గురు మృతుల వివరాలు వెల్లడించిన అధికార యంత్రాంగం నాల్గో మృతుడి వివరాలు ఎందుకు వెళ్లడించలేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ నివేదికను బయటపెట్టాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యాలు భద్రత ప్రమాణాలను అమలు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మాపరిశ్రమల్లో భద్రత ఆడిట్‌ నిర్వహించి ప్రభుత్వం కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గనిశెట్టి డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img