Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

ఓటు వేసే ముందు అభ్యర్థి నేర చరిత్రను తెలుసుకోండి ….

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.02.04.2024ది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధుల నేర చరిత్రను ప్రతీ ఓటరు స్వయంగా తెలుసుకోవాలని ఎన్నికల సంఘం సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చైతన్య పరుస్తోంది. ప్రజలందరికీ సేవ చేస్తానంటూ నమ్మబలికేవారు, గతంలో నేర ప్రవృత్తి గల చరిత్ర గురించి తెలుసుకోవడం ఓటరు భాధ్యత అని ఎన్నికల సంఘం తెలియజేసింది. కె.వై.సి. యాప్ ద్వారా అభ్యర్ధుల నేర పూర్వా పరాలు తెలుసుకోవచ్చును అని అన్నారు. అభ్యర్ధుల అఫిడవిట్ లను డౌన్ లోడ్ చేసుకుని చదువుకోవాలని, చదువు తెలియని నిరక్షరాస్తులకు తెలియ జెప్పాలని, ప్రతీ ఒక్కరూ పౌరుడు దీన్ని సామాజిక భాధ్యత గా గుర్తించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img