Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ప్రభుత్వ దుకాణాల్లో మద్యం నిల్,…. పాన్ షాపులు, బ్లాక్ లో ఫుల్ …..?

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : అనకాపల్లి జిల్లా చోడవరం లో ప్రభుత్వ దుకాణాల్లో మద్యం లేదంటూనే, పక్కనే ఉన్న చిన్న పాన్ షాపుల్లోను, బ్లాక్ లోను అధిక ధరలకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, వీటిపై కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల నెపంతో బ్లాక్ మార్కెట్ కు ప్రభుత్వ మద్యం ను తరలిస్తూ వెలుతురు వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా దుకాణాల్లో పని చేసే వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు. బ్లాక్ లో బాటిల్ మీద పది నుండి యాభై, వంద ఆపైన లాభానికి అమ్మి నల్ల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఎలక్షన్ కోడ్ నిబంధన వల్ల ప్రతి షాపుకు లిమిట్ పెట్టడం వల్ల లిమిట్ పెట్టిన దానిలో 70 శాతం ప్రభుత్వ మద్యం బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. రోజు వారీ సివిల్ పనులు చేసే వారు, వ్యవసాయ కార్మికులు, మద్యం ప్రియులు ప్రభుత్వ దుకాణాల్లో
మద్యం దొరకపోవడంతో బ్లాక్ లో అదనంగా డబ్బు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రోజంతా కష్టపడిన సొమ్మంతా నల్ల వ్యాపారులు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

చోడవరంలో బ్లాక్ లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నను, అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నారన్నారు.
ప్రతీ నెల అధికారులకు ముడుపులు అందుతుండటంతో ప్రజా ఆరోపణలు గాలికి వదిలేస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని,
నల్ల బజారుకి ప్రభుత్వ తరలి పోకుండా, మద్యం షాపు ఉద్యోగస్తులు, మీద
బ్లాక్ వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకోవాలని మద్యం వినియోగదారుల సంఘం, పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img