Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఈ నెల 19 న మైచర్ల పాలెంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట ….

– ప్రభుత్వ విప్, మంత్రులు, ఎం.పి.లను ఆహ్వానించిన సర్పంచ్, గ్రామస్తులు …

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.16.02.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని మైచర్లపాలెం గ్రామంలో ఈ నెల 19 న శ్రీ సీతారాములు ఆలయం పునః ప్రతిష్టాపన నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బూరే మాణిక్యం తెలియజేశారు. స్థానిక విలేఖరులతో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహా గణపతి, మహాలక్ష్మి ఉపాలయాలుగా కొలువు దీరి, మాఘ శుద్ద దశమి సోమవారం, మృగశిర నక్షత్ర మేష లగ్నము నందు అనగా ఈ నెల 19 ఉదయం గం.10.32 ని.లకు త్రిరాత్రాగమ శాస్త్ర ప్రకారం వేద పండితులు ధవళ ప్రసాద్ పర్య వేక్షణలో పాకల కామేశ్వరరావు ఆధ్వర్యంలో వారి బృందం చే స్వామి అమ్మవార్ల ప్రతిష్ట నిర్వహిస్తున్నామని తెలిపారు. చోడవరం ఎమ్మేల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, అనకాపల్లి ఎం.పి. సత్యవతి, జిల్లా మంత్రులు బూడి. ముత్యానాయుడు, గుడివాడ అమర్నాథ్ వంటి ప్రముఖులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు తెలియజేశారు. శనివారం నుండి వేద పండితులు చే మహా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, సంప్రోక్షణ, కలశ స్థాపన, రక్షాబంధన పూజలతో ప్రారంభించి, హోమాగ్ని సమేతంగా మూడు రోజుల పాటు ధాన్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం లు నిర్వహించి, వేదస్మార్తాగమ రీత్యా శిఖరము, గణపతి, శ్రీ సీతారాములు, మహాలక్ష్మి శిలా విగ్రహాలను ప్రాణ ప్రతిష్ట చేయ సంకల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మూడు రోజుల పాటు నిరంతరాయంగా అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 19 మధ్యాహ్నం నుండి నూతన ఆలయంలో పుణ్య దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామన్నారు. పురాణ భజనలు, తప్పెటగుళ్ళు, సన్నాయి మేళాలు, భారీ మందు గుండు సామాగ్రితో గ్రామస్తులు, భక్తులు, ఉదార స్వభావుల సహాయ సహకారాలతో నిర్వహించెడి దేవాలయ ప్రతిష్ట, సీతారామ కళ్యాణం లో పాల్గొని శ్రీరాముల వారి దివ్యమైన ఆశీస్సులు ప్రతీ ఒక్కరూ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ వేపాడ అప్పారావు, మాజీ సర్పంచ్ బూరె శంకర్రావు, నానుబిల్లి అర్జున నర్సింగరావు (చిన్న నాయుడు) మైచర్ల దేవుళ్ళు నాయుడు, ధరిమిశెట్టి అచ్చింనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img