Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

పసలేని ప్రధాని ప్రసంగం …

ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలను మరోసారి మోసం చేసిన మోడి. – సి.పి.ఎం.

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.07.05.2024ది. అనకాపల్లి జిల్లాలో ఎన్‌డిఎ కూటమి నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో దేశ ప్రధాని మోడీ, ప్రసంగంలో కనీసం ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కనీసం పెదవి విప్పకపోవడం దుర్మార్గమని సి.పి.ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి.వెంకన్న మండల కార్యదర్శి బి.టి పేర్కొన్నారు. స్థానిక సి
ఐ.టి.యు కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయమై తమ వైఖరిని వెల్లడించకుండా, ప్లాంట్‌ను ప్రైవేటీకరించే మోడీని భుజానెత్తుకొని మోస్తున్నట్లు కూటమి నాయకులు మాట్లాడారని తెలిపారు.అనకాపల్లి బిజెపి ఎంపి అభ్యర్ధి నన్ను గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపించేస్తానని, ప్రధాన మంత్రితో తనకు అత్యంత సాన్నిహిత్యం ఉందని చెప్పుకున్న సిఎం రమేష్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మబోమని మోడీతో ఎందుకు చెప్పించ లేదని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ పట్ల మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది లేనిది సి.ఎం రమేష్ స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి 15 వేల కోట్లు ఇచ్చానని చెప్పారు. అవన్నీ కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళాయని తెలిపారు. అక్కడ నష్టపోయిన గిరిజనులకు ఏమీ ఇవ్వలేదన్నారు. పునరావాసం కోసం రూ.33 వేల కోట్లు అవసరం అయితే రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. అడవి బిడ్డలను గోదారిలో ముంచారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉపసంహరణ, సొంత గనులు కేటాయింపు వంటి ప్రాధాన్యత అంశాలను విస్మరించారని విశాఖ రైల్వేజోన్‌ పై కేంద్ర, ప్రభుత్వం దొంగ నాటకాలడుతున్నట్లు స్పష్టంగా అర్ధమౌతుందని తెలిపారు. జిల్లాలో ప్రధాన అంశాలేవి ప్రస్తావించకుండా విమర్శలకే పరిమితమయ్యారని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, సిపిఎస్‌ రద్దు వంటి అశాలపై తన వైఖరిని ఎన్ డి ఎ కూటమి వెల్లడించకుండా కప్పదాటు వైఖరిని ప్రదర్శించారని తెలిపారు. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీకి గొంతుకోసింది కూటమి లో బాగస్వామ్యపక్షాలేనని తెలిపారు. తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలను మూసివేశారు. వీటికి ప్రధాన కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలే. చెరుకు రైతులు గురించి మాట్లాడిన మోడీ ఆ రైతులకు జీవనాధర మైన షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్దరణకై ప్రస్తావించక పోవడం రైతులను మోసగించడం తప్ప మరొకటి కాదన్నారు. పేదరికం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా రామమందిరం నిర్మాణాన్ని విజయంగా చెప్పుకోవడం బాధ్యతా రహితంగా మాట్లాడడ మేనని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని వాటిని అరికడతామని ఎన్నికల సభల్లో ప్రసంగించడ మంటే మత విద్వేశాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి బిజెపి పథకం ప్రకారం వ్యవహరిస్తుందని అర్ధమౌతుంద తెలిపారు. ప్రజలు అప్రమత్తమై బిజెపి అభ్యర్ధి సిఎం రమేష్‌ను ఆ పార్టీకి మద్ధతు ఇస్తున్న పార్టీలను, ఓడించడం ద్వారా దేశ ఐక్యతను, మత సామరస్యాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగాన్ని కాపాడు కోగలమని వారు స్పష్టం చేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img