Monday, May 20, 2024
Monday, May 20, 2024

పేద ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం : రోటరీ క్లబ్

విశాలాంధ్ర – ధర్మవరం : పేద ప్రజలకు సేవ చేస్తూ, వారికి కంటి వెలుగును ప్రసాదించడమే మా రోటరీ క్లబ్ యొక్క లక్ష్యము అని అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ, కోశాధికారి వై. సుదర్శన్ గుప్తా, ఉపాధ్యక్షులు కె. నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు ఈ నెల 19వ తేదీన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ యొక్క కరపత్రాలను సాంస్కృతిక మండలి లో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు బండి చిన్న పుల్లన్న, కీర్తిశేషులు బండి నారాయణమ్మ వీరి కుమారులు బండి వెంకట నరసింహయ్య, బండి హరి నాథ్, కీర్తిశేషులు పాలగిరి సుశీలమ్మ వీరి కుమారులు పాలగిరి శంకరనారాయణ, కీర్తిశేషులు పాలగిరి నాగలక్ష్మి ,వీరి భర్త పాలగిరి నాగభూషణం- ధర్మవరం వారు దాతలుగా వ్యవహరించడం జరుగుతున్నదని వారు తెలియజేశారు. ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్- ధర్మవరం, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ-శ్రీ సత్యసాయి జిల్లా వారి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణములో రోటరీ క్లబ్ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 60 వేలకు మందికి పైగా కంటి వెలుగును ప్రసాదించడం, ఉచితంగా కంటి అద్దాలను కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉచిత రవాణా ఖర్చు, ఉచిత ఆపరేషన్, ఉచిత అద్దాల పంపిణీ సేవ కేవలం రోటరీ క్లబ్ కే సాధ్యము అని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా గుర్తింపు ఓటరు కార్డు, ఏదేని రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు, చిరునామా, సెల్ నెంబర్ తో కూడిన వివరాలు తప్పకుండా శిబిరానికి తీసుకొని రావాలని తెలిపారు. శిబిరం అన్నకు వచ్చువారు ఈ హెచ్ ఎస్ కార్డు గాని, ఆరోగ్యశ్రీ కార్డు గాని, మిగిలిన ఏ కార్డు కూడా తీసుకొని రావలసిన అవసరం లేదు అని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని, తగ్గించుకొని రావాలని సూచించారు. కంటి నిపుణుల సలహాలతో, కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కావున ఈ సదవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు- సత్రశాల ప్రసన్నకుమార్, రిటైర్డ్ టీచర్ రామకృష్ణ, రత్న శేఖర్ రెడ్డి, సోలిగాళ్ళ వెంకటేశులు, దాత పాలగిరి నాగభూషణం, పిరమిడ్ కేంద్ర సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img