Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెడీమేడ్ గుడ్డల షాపు దగ్ధం

27 లక్షలు నష్టపోయిన బాధితుడు.
ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి.
విశాలాంధ్ర- ధర్మవరం :
పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయం, పిఆర్టి వీధిలో గల జి -9 మెన్స్ వేర్ అనే రెడీమేడ్ గుడ్డల షాపు సోమవారం రాత్రి 10-11 గంటల నడుమ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చెలిమి రంగనాథ్ అనే వ్యక్తి గత 12 సంవత్సరాలుగా రెడీమేడ్ గుడ్డల షాపుతో జీవనం కొనసాగించేవాడు. తెలిసిన, తెలియని చోట, బ్యాంకుల్లో కూడా దాదాపు 30 లక్షల వరకు అప్పు తెచ్చి, తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాడు.దినసరి కృత్యం లో భాగంగా మంగళవారం రాత్రి అంగడికి బీగాలు వేసుకొని, సిద్దయ్యగుట్ట-నెహ్రు నగర్ లో గల ఇంటికి వెళ్లిపోయాడు. తదుపరి గంట తర్వాత అతని షాపు పక్కన ఉన్నవారు పొగ మంటలు చూసి రంగనాథుకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. తదుపరి ఫైర్ ఇంజన్ కూడా సమాచారం ఇవ్వడంతో, హుటా హుటిన ఫైర్ ఇంజన్ సిబ్బంది నీటితో పూర్తిగా మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే లక్షలు విలువైన రెడీమేడ్ దుస్తులు పూర్తిగా బూడిద అయిపోయాయి. బాధితుడు రంగనాథ్ కన్నీరు మున్నేరుగా విల పిస్తూ, అనుకోని సంఘటన వలన ఇంత నష్టం వాటిలిందని, నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలని విన్నవించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img