Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సాధారణ ఎన్నికలు – 2024 నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ రూమ్, ఎంసిఎంసి, మీడియా సెల్, సోషల్ మీడియా, సీవిజిల్, వెబ్ కాస్టింగ్, కంప్లైంట్ సెల్ తదితర ఏర్పాట్లకు సంబంధించి జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ రూమ్, ఎంసిఎంసి, మీడియా సెల్, సోషల్ మీడియా, సీవిజిల్, వెబ్ కాస్టింగ్, కంప్లైంట్ సెల్ తదితర ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లను వేగంగా చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ ల కోసం సిబ్బందిని నియమించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టాలన్నారు. అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలపై పూర్తి స్పష్టతతో ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను, సూచనలను పూర్తిగా చదివి అర్థం చేసుకుని, సూచనలను అనుసరించి ఏర్పాట్ల విషయమై క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఆయా కంట్రోల్ రూమ్ లలో టీవీలు, కుర్చీలు, టేబుల్స్ ఏర్పాటు, తదితర ఏర్పాట్లపై పరిశీలన చేసుకుని పనులను పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, అడిషినల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఎన్ఐసి డిఐఓ రవిశంకర్, డిసిఓ ప్రభాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అంజన్ బాబు, సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్ రావు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, హార్టికల్చర్ డీడీ రఘునాథరెడ్డి, ఏపీఎంఐపీడీ ఫిరోజ్ ఖాన్, ఎపిజిఎల్ఐ డిడి భాస్కర్, ఫిషరీస్ డిడి కృష్ణ నాయక్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img